Advertisementt

SSMB28: శోభన లేదా రమ్య

Tue 31st Jan 2023 05:12 PM
ramya krishnan,mahesh babu,ssmb28  SSMB28: శోభన లేదా రమ్య
SSMB28: Shobhana or Ramya Krishnan? SSMB28: శోభన లేదా రమ్య
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ లో విడుదల అని డేట్ కూడా ఇచ్చారు కానీ.. ఇప్పుడు షూటింగ్ ఆలస్యమవడంతో అది దసరా కి మరే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ చిత్రంలో మహేష్ కో జోడిగా పూజ హెగ్డే అలాగే క్యూట్ అండ్ ఎనేర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ పై యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. తర్వాత షెడ్యూల్ లో హీరోయిన్స్ ఇద్దరూ జాయిన్ అవుతారట. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ అండ్ కో సీనియర్ నటి శోభనని సంప్రదిస్తున్నారనే న్యూస్ నడుస్తుంది.

ఎప్పటినుండో త్రివిక్రమ్ ఆమెని సంప్రదిస్తున్నారని అంటున్నా.. ప్రస్తుతం శోభన SSMB28 లో నటించాలా, లేదా అనే డైలమాలో ఉండడంతో త్రివిక్రమ్ అండ్ బ్యాచ్ శోభన కాకపోతే రమ్యకృష్ణని తీసుకోవాలని అనుకుంటున్నారట. రమ్యకృష్ణ అటు రిచ్ లుక్ లోను, ఇటు గ్లామర్ పరంగాను మహేష్ కి అమ్మగానో, అత్తగానో నటించడం ఖాయమంటున్నారు. మరి త్రివిక్రమ్ సినిమాలంటే రిచ్ నెస్ కి కేరాఫ్ అడ్రెస్స్, ఈసారి త్రివిక్రమ్ ఎలాంటి బ్యాగ్డ్రాప్ తో మహేష్ ని చూపించబోతున్నారో చూడాలి. 

SSMB28: Shobhana or Ramya Krishnan?:

Ramya Krishnan key role in Mahesh Babu SSMB28 film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ