క్రేజీ డేట్స్ కి, క్రేజీ ఫెస్టివల్స్ కి అన్నదమ్ములైనా, స్టార్ హీరోలయినా పోటీకి సై అనడం చూస్తూనే ఉంటాము, ఈ ఏడాది సంక్రాంతికి ఒకే నిర్మాణ సంస్థలో నిర్మితమైన మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య-బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు పోటీ పడ్డాయి. అందులో రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. వాల్తేర్ వీరయ్య కి కాలక్షన్స్ పరంగా క్రేజ్ వచ్చింది. రెండు సినిమాల కలెక్షన్స్ తో ఒకే నిర్మాణ సంస్థ కాబట్టి హ్యాపీనే. ఈ ఏడాది ఈ సంక్రాంతి క్రేజ్ ముగియగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే పోటీ స్టార్ట్ అయ్యింది. అది కూడా ఎంతమంది బరిలోకి దిగితున్నారో అనేది పక్కనబెడితే.. ఇప్పుడొక క్రేజీ న్యూస్ మాత్రం తెగ హైలెట్ అవుతుంది.
అది మెగా హీరోలైన పవన్ కళ్యాణ్-రామ్ చరణ్ లు వచ్చే 2024 సంక్రాంతికి ఫైట్ కి సిద్ధమవుతున్నారని. ఇప్పటికే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చెయ్యబోయే ఉస్తాద్ భగత్ సింగ్ ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ అని చెప్పేసాడు. ఇప్పుడు రామ్ చరణ్-శంకర్ కలయికలో తెరకెక్కుతున్న RC 15 ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తే బావుంటుంది అని దిల్ రాజు అనుకుంటున్నాడట. అంటే ఈ ఏడాది చిరు-బాలయ్య మధ్యలో వారసుడితో చేతులు కాల్చుకున్న దిల్ రాజు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పోటీకి రెడీ అయ్యాడంటున్నారు.
మరి పవన్ కళ్యాణ్-రామ్ చరణ్ మధ్యలో ఫైట్ అంటే ప్రేక్షకులకి యమా ఇంట్రెస్టింగ్ గా ఉంటే.. మెగా ఫాన్స్ మాత్రం నలిగిపోతారు. దిల్ రాజు ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఆయన మాట ఆయనే వినడు కదా.. (వారసుడు రిలీజ్ విషయంలో జరిగింది ఇదే).