Advertisementt

దర్శకుడు సాగర్ కన్నుమూత

Thu 02nd Feb 2023 10:02 AM
senior director sagar  దర్శకుడు సాగర్ కన్నుమూత
Veteran Director Sagar Passed Away దర్శకుడు సాగర్ కన్నుమూత
Advertisement
Ads by CJ

సీనియర్ దర్శకులు సాగర్ (70) చెన్నైలో ఈరోజు ఉదయం 5.20 నిమిషాలకి ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్ ఈరోజు కన్నుమూశారు. కెరీర్‌లో దాదాపు 30కిపైగా సినిమాల‌కు సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌రేష్, విజ‌య‌శాంతి కాంబినేష‌న్‌లో రూపొందిన రాక‌సిలోయ సినిమాతో ద‌ర్శ‌కుడిగా సాగ‌ర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సాగర్ స్టూవ‌ర్డ్‌పురం దొంగ‌లు చిత్రంతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణ‌, సాగ‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన అమ్మ‌దొంగ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

టాలీవుడ్ డైరెక్టర్ వినాయక్, శ్రీను వైట్ల లాంటి వారు సాగర్ దగ్గర అసిస్టెంట్స్ గా పని చేసారు. సాగర్ కన్నుమూయడంతో టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సాగర్ అంత్యక్రియలు వివరాలు తెలియాల్సి ఉంది.

Veteran Director Sagar Passed Away:

Senior Director Sagar Passes Away At 70

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ