మంచు ఫ్యామిలిలో ఏం జరుగుతుందో అర్ధం కాక నెటిజెన్స్ తలలు పట్టుకుంటున్నారు. మంచు విష్ణు సినిమాలు, అలాగే వ్యాపారాల్లో బిజీగా వుంటుంటే.. మంచు మనోజ్ నిన్నమొన్నటివరకు ఖాళీగానే ఉన్నాడు. కానీ అతని సెకండ్ మ్యారేజ్ విషయంలో మంచు మనోజ్ కొద్దిరోజులుగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. భూమా ఫ్యామిలీ మెంబెర్ మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయమై అధికారిక ప్రకటన లేకపోయినా మంచు మనోజ్ మాత్రం మౌనికతో ఏడడుగులు నడవడానికి సిద్దమయ్యాడు.
అయితే ఫిబ్రవరి రెండు, మూడు తారీఖుల్లో మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వినిపించినా.. మంచు ఫ్యామిలీ నుండి ఎలాంటి స్పందన లేదు. అసలు మనోజ్ ఈ రెండురోజుల్లో నిజంగానే పెళ్ళికొడుకు అవుతున్నాడా? పెళ్లి పీటలెక్కుతున్నాడా? లేదంటే ఈ పెళ్లి డేట్ అనేది రూమరా? అనేది అర్ధం కావడం లేదు. ఒకవేళ మనోజ్ ఎంతగా గుట్టుచప్పుడు కాకుండా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నా ఏదో ఒక లీకైతే బయటికి వస్తుంది. కానీ మంచు ఫ్యామిలిలో ఇలాంటి విశేషం ఏమి జరిగినట్టుగా అనిపించడం లేదు.
రీసెంట్ గా మంచు మనోజ్ గుడ్ న్యూస్ అంటూ ఊరించి కొత్త సినిమాపై అప్ డేట్ ఇచ్చాడు కానీ పెళ్లి విషయం తేల్చలేదు. అలాగే మొన్న బెంగుళూరు వెళ్లి నారాయణ హృదయాలయలో తారకరత్నని పరామర్శించి వచ్చాడు మనోజ్. అయితే ఇప్పుడు మంచు మనోజ్ రెండో వివాహంపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవబోతున్నది అనేది మాత్రం తెలుస్తుంది.