Advertisementt

కియారా-సిద్దార్థ్ ల వెడ్డింగ్ డేట్ వచ్చేసింది

Thu 02nd Feb 2023 01:45 PM
kiara advani,sidharth malhotra  కియారా-సిద్దార్థ్ ల వెడ్డింగ్ డేట్ వచ్చేసింది
Kiara-Sidharth Wedding Details Revealed కియారా-సిద్దార్థ్ ల వెడ్డింగ్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఇప్పటికే సునీల్ శెట్టి తన కుమార్తె అతియా శెట్టి పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించగా.. ఇప్పుడు కియారా అద్వానీ పెళ్లి ఏర్పాట్లు ఓ రేంజ్ లో జరిగిపోతున్నాయంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఫిబ్రవరి 6 న కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాల వివాహం జరగబోతుంది, కానీ కియారా అద్వానీ తన పెళ్లి విషయాలేవీ చెప్పకుండా చాలా అంటే చాలా సీక్రెట్ ని మెయింటింగ్ చేస్తుంది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ లోనే కియారా అద్వానీ పెళ్లి కూతురుగా సిద్దార్థ్ తో మూడు ముళ్లు వేయించుకోబోతుంది అని, అందుకే కియారా అద్వానీ మనీష్ మల్హోత్రా షాప్ చుట్టూ తిరిగుతుంది అంటున్నారు.

కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాల వివాహం రాజస్థాన్లోని జైసల్మేర్ పోర్ట్ లో జరగబోతుంది అని, పంజాబి సంప్రదాయంలో జరగనున్న వీళ్ళ పెళ్ళిలో ఈ నెల 4, 5 తేదీల్లో సంగీత్, మెహిందీ కోసం ఏర్పాట్లు భారీగా నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఫిబ్రవరి 6న కియారా-సిద్దార్థ్ లు వివాహ బంధంతో ఒక్కటవుతారట. కియారా అద్వానీ-సిద్దార్థ్ ల పెళ్లి ఏర్పాట్లును ఇరు కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కానిచ్చేస్తున్నారు.

ఈపెళ్లికి కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, షాహిద్ కపూర్ లాంటి సెలబ్రిటీస్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అందరిలాగా కియారా అద్వానీ-సిద్దార్థ్ ల వివాహ హక్కులని ప్రముఖ ఓటిటి నుండే ప్రసారమవుతాయని తెలుస్తుంది.

Kiara-Sidharth Wedding Details Revealed:

Kiara Advani and Sidharth Malhotra wedding dates and venue revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ