సాయి పల్లవి అంటే పెరఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్స్. ఆమె నేచురల్ నటనకు ముగ్దుడవని ప్రేక్షకుడు ఉండడు. సాయి పల్లవి కూడా కమర్షియల్ హంగులకి, గ్లామర్ ట్రీట్ కి చాలా దూరంగా ఉంటుంది. సాయి పల్లవి అంటే నటించదు, జీవిస్తుంది. అంతలా పాత్రలో లీనమైపోతుంది. డాన్స్ ల్లో కుమ్మేస్తుంది. మేకప్ వెయ్యదు.. వేసినా వెగటు పుట్టదు అన్న రేంజ్ లో తన అందాలను సహజసిద్ధంగా చూపించే సాయి పల్లవిని అందుకే నేచురల్ బ్యూటీ అనేది. అలంటి టాలెంటెడ్ బ్యూటీని టాలీవుడ్ పట్టించుకోవడం లేదా.. అంటే అవుననే అనిపిస్తుంది. విరాట పర్వం, గార్గి సినిమాల తర్వాత సాయి పల్లవి తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యలేదు.
తమిళనాట కాస్త బిజీగా వున్న సాయి పల్లవి.. తెలుగులో మాత్రం తన వద్దకు దర్శకనిర్మాతలు కథలు తేవడం లేదో.. లేదంటే ఆమె కథలు నచ్చక రిజెక్ట్ చేస్తుందో కానీ.. ఒక్క ఆఫర్ కూడా సాయి పల్లవి చేతిలో లేదు. మరి ఇంత టాలెంటెడ్ గర్ల్ ని టాలీవుడ్ ఎందుకు పట్టించుకోవడం లేదో వారికే తెలియాలి. కానీ ఆమె ఫాన్స్ మాత్రం ఆమెని బాగా మిస్ అవుతున్నారు. ప్రస్తుతం అయితే సాయి పల్లవికి తమిళ అవకాశాలొస్తున్నాయంటూ ప్రచారం జరుగుతుంది.
అది కోలీవుడ్ స్టార్ హీరోలయిన ధనుష్ అలాగే అజిత్ సినిమాల్లో సాయి పల్లవికి ఆఫర్స్ వచ్చాయని అంటున్నారు కానీ.. అధికారిక ప్రకటన అయితే లేదు. మరి సాయి పల్లవిని టాలీవుడ్ లైట్ తీసుకున్నా కోలీవుడ్ అవకాశం కల్పిస్తుందేమో చూడాలి.