Advertisementt

కియారా అద్వానీ పెళ్ళిలో వాళ్ళే స్పెషల్

Sun 05th Feb 2023 01:44 PM
sidharth malhotra,kiara advani  కియారా అద్వానీ పెళ్ళిలో వాళ్ళే స్పెషల్
Sidharth Malhotra, Kiara Advani wedding guest list కియారా అద్వానీ పెళ్ళిలో వాళ్ళే స్పెషల్
Advertisement
Ads by CJ

రేపు ఫిబ్రవరి 6 రాజస్థాన్లోని జైసల్మేర్ పోర్ట్ లో బాలీవుడ్ క్యూటీ కియారా అద్వానీ కోరుకున్న ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు నడిచేందుకు రంగం సిద్ధమైంది. నిన్న శనివారం ఉదయం కియారా అద్వానీ, సిద్దార్థ్ లు ఫామిలీస్ తో కలిసి ముంబై నుండి రాజస్థాన్ కి వెళ్ళారు. నిన్న సాయంత్రం మెహిందీ, ఈరోజు జరగబోయే సంగీత్ ఫంక్షన్స్ లో కియారా అద్వానీ-సిద్దార్థ్ లు మునిగి తేలిపోతున్నారు. అయితే అంగరంగ వైభవంగా జరిగే ఈ పెళ్ళికి బాలీవుడ్ నుండి అతి తక్కువమంది సెలబ్రిటీస్ మాత్రమే హాజరవుతున్నారు.

అందులో ముఖ్యంగా కియారా అద్వానీ కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ తన భార్య మీరా రాజ్ ఫుట్ తో కలిసి కియారా పెళ్ళికి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. అక్కడ సంగీత్ ప్రోగ్రామ్ లో షాహిద్ కపూర్ స్పెషల్ పెరఫార్మెన్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే డిజైనర్ మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్ లు స్పెషల్ గెస్ట్ లు గా కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా పెళ్ళికి హాజరవుతున్న వాళ్లలో ఉన్నారు.

టాలీవుడ్ నుండి రామ్ చరణ్ కియారా పెళ్ళికి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. కియారా అద్వానీ రామ్ చరణ్ తో కలిసి భారీ బడ్జెట్ RC15 లో నటిస్తుంది. అలాగే ఇంకా కొద్దిమంది గెస్ట్ లు ఈ పెళ్ళికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Sidharth Malhotra, Kiara Advani wedding guest list:

Sidharth Malhotra And Kiara Advani Wedding celebrations