మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేసాడు. కానీ SSMB28 మొదటి షెడ్యూల్ లో పాల్గొన్న మహేష్ తన లుక్ పై అంతగా ఇంప్రెస్స్ అవ్వకపోవడం, తీసిన యాక్షన్ సన్నివేశాలపై సంతృప్తిగా లేకపోవడంతో.. ఆ షెడ్యూల్ పక్కనబడేసి కొత్తగా సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టారు. అయితే మహేష్ మధ్యలో తల్లితండ్రుల మరణంతో సఫర్ అయ్యి.. తర్వాత విదేశాలకు వెళ్ళొచ్చాడు. రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలైన SSMB28 షూటింగ్ కి వెళుతున్న మహేష్ తన లుక్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.
తాజాగా మహేష్ వైఫ్ నమ్రత మహేష్ లుక్ ని బయటపెట్టేసింది. ఆమె మహేష్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేస్తున్న పిక్, అలాగే మహేష్ ఇంకా ఫ్రెండ్స్ తో కలిసి దిగిన సెల్ఫీ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మహేష్ క్లీన్ షేవ్ లో కొద్దిగా హెయిర్ పెంచి హ్యాండ్ సమ్ గా కొత్తగా కనిపించాడు. అది చూసిన మహేష్ ఫాన్స్ త్రివిక్రమ్ సినిమాలో ఇంతే స్టైలిష్ గా మహేష్ కనిపిస్తాడని, ఆయన లుక్ చూసాక కూల్ గా ఫీలవుతున్నారు.
ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే శ్రీలీల కూడా మెయిన్ లీడ్ కేరెక్టర్ లోనే కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే మహేష్ కి విలన్ గా SSMB28 లో ఎవరు కనిపించబోతున్నారో మేకర్స్ రివీల్ చెయ్యలేదు.