ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతకుముందు ఎన్టీఆర్ తన సినిమా డిసాస్టర్ వచ్చినప్పుడు కొద్దిరోజులు ఎవరికి కనబడేవాడు కాదు, డిప్రెషన్ లో ఉండేవాడు అంటూ ఎన్నో కథనాలు వినేవాళ్ళం, చూసేవాళ్ళం, టెంపర్ కి ముందు కి వచ్చిన ప్లాప్స్ తో అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్లాడని అంటూ ఉంటారు. అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత NTR కొరటాలతో ఇమ్మిడియట్ గా సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ అది ఏడాదిగా లేట్ అవుతూ ఉండడంతో ఎన్టీఆర్ ఫాన్స్ కి విసుగొచ్చి నిర్మాణ సంస్థలపై పడుతున్నారు.
ఎన్టీఆర్ ఫాన్స్ చేసే హడావిడి, అతి విషయంలో బాగా ప్రస్టేట్ అయ్యినట్లుగా ఉన్నాడు. అందుకే అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్‌కి ముందు మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ తన NTR 30 అప్‌డేట్ ఇస్తారంటూ మాట్లాడింది. దానితో యాంకర్ సుమపై ఇరిటెడ్ అయినట్లుగా కనిపించడం, సీరియస్ లుక్ ఇవ్వడంతో.. పక్కనే ఉన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్‌ని కూల్ చేయటంతో ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయాడు. కానీ అభిమానులకి మాత్రం ఎన్టీఆర్ ఓ రేంజ్ లో క్లాస్ పీకడం చూస్తే సోషల్ మీడియాలో అభిమానులు చేసే రచ్చకి ఎన్టీఆర్ ఎంతగా ఇబ్బంది పడ్డాడో అందుకే ప్రస్టేట్ అయ్యాడనిపించేలా వారికి ఓ వార్నింగ్ ఇచ్చి పడేసాడు.
అయితే కూల్ గా అభిమానులకి చెప్పాల్సింది పోయి.. ఎన్టీఆర్ ఎందుకంత కోపంగా మారాడు. తన NTR30 విషయంలో ఎన్టీఆర్ ఏమైనా ఆందోళన పడుతున్నాడా.. NTR30 మొదలవడానికి ఇంత సమయం తీసుకోవడం ఎన్టీఆర్ కి నచ్చలేదా.. లేదంటే ఈ అప్ డేట్ విషయంలో ఇంత కోపంగా ఫాన్స్ తో మాట్లాడాల్సిన అవసరం లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.