Advertisementt

హీరోయిన్ గా రశ్మికనే ఫిక్స్

Mon 06th Feb 2023 12:44 PM
vijay devarakonda,rashmika  హీరోయిన్ గా రశ్మికనే ఫిక్స్
Vijay Devarakonda Teams Up With Director Parasuram హీరోయిన్ గా రశ్మికనే ఫిక్స్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో కొత్త మూవీని ప్రకటించాడు దిల్ రాజు. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరశురామ్-విజయ్ దేవరకొండ లు కలయికలో గీత గోవిందం 2 రాబోతుంది అని ప్రచారం జరుగుతుంది. అదే నిజమనేలా ఈ ప్రకటన ఉండడంతో రౌడీ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. దిల్ రాజు ఎంటర్ అయ్యాడు అంటే.. సినిమాపై అంచనాలు భీభత్సంగా పెరిగిపోతాయి. అదలాఉంటే.. ఇప్పుడు ఇది గీత గోవిందం 2 నా లేదంటే మారేదన్నా కొత్త కాన్సెప్టా అనేది పక్కనబెడితే.. హీరోయిన్ విషయంలో అందరిలో ఆత్రుత మొదలైంది.

ఇదే గీత గోవిందం 2 అయితే గనక ఖచ్చితంగా రష్మిక నే హీరోయిన్ గా తీసుకుంటారు. గీత గోవిందంలో విజయ్-రష్మిక కలయిక చాలా ఫ్రెష్ గా అందరిని ఆకట్టుకుంది. దానితో ఈ కాంబోపై డియర్ కామ్రేడ్ విషయంలో అభిమానులు అంచనాలు పెట్టుకున్నా అది వర్కౌట్ అవ్వలేదు. కొద్దిరోజులుగా వారి మధ్యన లవ్, డేటింగ్ విషయంలో ఏదో నడుస్తుంది అనే రూమర్స్ ఉన్న సమయంలో విజయ్ దేవరకొండ-రష్మిక కలిసి సినిమా చేస్తే విషయం మాములుగా ఉండదు.

సో విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబో మూవీ గీత గోవిందం2 కాకపోయినా.. కొత్త స్టోరీతో సినిమా అయినా రశ్మికనే హీరోయిన్ అయితే ఆ సినిమాపై అంచనాలు మాములుగా ఉండవు. విజయ్-పరశురామ్ హీరోయిన్ గా రశ్మికనే తీసుకోవాలనేది ఫాన్స్ డిమాండ్.

Vijay Devarakonda Teams Up With Director Parasuram:

Vijay Devarakonda Again Pair Up With Rashmika

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ