Advertisementt

అన్ స్టాపబుల్2 పై ఆడియన్స్ రియాక్షన్

Mon 06th Feb 2023 10:01 PM
unstoppable 2,balakrishna  అన్ స్టాపబుల్2 పై ఆడియన్స్ రియాక్షన్
Audience Reaction on Unstoppable 2 అన్ స్టాపబుల్2 పై ఆడియన్స్ రియాక్షన్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అల్లు అరవింద్ ఆహా లో అన్ స్టాపబుల్ టాక్ షో మొదలు పెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. సీజన్ 1 తోనే ఆహా కి బోలెడంత మంది సబ్ స్క్రైబర్స్ పెరిగిపోయారు. బాలకృష్ణ లోని కొత్త కోణం చూడడానికి, ఆయన స్టయిల్, ఆయన అల్లరి ఆయన సందడి చూసేందుకు వారం వారం ఇంట్రెస్ట్ చూపించారు. సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ సీజన్ 1 కి ప్లస్ అయ్యారు. దానికి తోడు ఆహా టాక్ షో ఎంత స్క్రిప్టెడ్ అయినా.. జనాలు పట్టించుకోలేదు. ఎంతసేపు బాలయ్య గురించి, వచ్చే గెస్ట్ ల గురించే మట్లాడుకున్నారు తప్ప.. ఇంకేదీ ఆలోచించలేదు. దానితో సీజన్ 2 పై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది.

కానీ అన్ స్టాపబునుల్ సీజన్ అనుకున్న అంచనాలను, ఆ హైప్ ని అందుకోలేకపోయింది. ప్రభాస్-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ కి తప్ప, ఏ ఎపిసోడ్ పైనా జనాలు ఇంటరెస్ట్ చూపించలేదు సరి కదా రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చూసాక.. ఆడియన్స్ ఆహా అన్ స్టాపబుల్ అంతా స్క్రిప్టెడ్.. లేదంటే బాలయ్య పవన్ ని అంత స్మూత్ గా డీల్ చేస్తారా.. సీజన్ 1 కి ఉన్న క్రేజ్, ఆసక్తి ఈ సీజన్2 మీద లేదు.. పవన్ కళ్యాణ్-బాలయ్య ఎపిసోడ్ ఆర్టిఫీషియల్ గా ఉంది.. సీజన్ 2 బోర్ కొట్టేస్తుంది అంటూ ప్రేక్షకుల పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. 

అన్ స్టాపబుల్ స్క్రిప్డ్, ఇక బాలయ్య స్టయిల్ అంతా సీజన్ 1 లో చూసి ఇంప్రెస్స్ అయ్యాము, సీజన్ 2 లో ఎలాంటి కొత్తదనం లేదు, పవన్, ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్స్ చాలా నెమ్మదిగా సాగాయి, వాటికే మళ్ళీ రెండు ఎపిసోడ్స్ కింద కట్ చెయ్యడం, మధ్యలో కొన్ని వారలు అసలు ఎపిసోడ్స్ కూడా లేవు అంటూ పలువురు ఆహా ఆడియన్స్ అన్ స్టాపబుల్ సీజన్ పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Audience Reaction on Unstoppable 2:

Public Reaction Unstoppable 2 with NBK

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ