కెరీర్ లో ఎన్నో ప్లాప్ ల తర్వాత బింబిసార తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ కి గత ఏడాది ఆ సినిమాతో మంచి పేరొచ్చింది. బింబిసార లో డ్యూయెల్ రోల్ తో అదిరిపోయే యాక్షన్ తో అద్భుతంగా కనిపించిన కళ్యాణ్ రామ్ కి ఆ సినిమా థియేటర్స్ లోనే కాదు, ఓటిటి లోను, అలాగే బుల్లితెర మీద అదిరిపోయే రెస్పాన్స్ కనిపించింది. అయితే ఇప్పుడు బింబిసార తరవాత ఆ సక్సెస్ ఊపులో కళ్యాణ్ రామ్ అమిగోస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
రేపు శుక్రవారం విడుదలతున్న అమిగోస్ పై అంచనాలు ఎలా ఉన్నా.. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్, ట్రిపుల్ పెరఫార్మెన్స్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో అర్ధం కాక నందమూరి ఫాన్స్ అయోమయంలో ఉన్నారు. ఒకపక్క టైటిల్ ఎక్కుతుందా అనే సందేహమూ వెలిబుచ్చుతున్నారు. తనవంతుగా సినిమాని ప్రమోట్ చేస్తున్న కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాపై నమ్మకంతో ఉన్నాడు. కళ్యాణ్ రామ్ బింబిసార సక్సెస్ ని అమిగోస్ తో కంటిన్యూ చెయ్యాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం కళ్యాణ్ రామ్ కి అమిగోస్ ఓం 3D లా షాక్ ఇవ్వదు కదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్, ఎన్నో రాత్రులొస్తాయనే సాంగ్ అందరిని బాగా ఇంప్రెస్స్ చేసాయి. అలాగే కళ్యాణ్ రామ్ కొన్ని చోట్ల లుక్స్ వైజ్ గాను చాలా హ్యాండ్ సామ్ గా కనిపిస్తున్నాడు. మరి అమిగోస్ రిజల్ట్ ఏమిటి అనేది మరికొద్ది గంటల్లోనే రివీలవుతుంది.