కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఆయన నటించిన సార్ మూవీ ఈ నెల 17న తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తెలుగులో సార్ ప్రమోషన్స్ చెయ్యడం లేదు, సినిమా రిలీజ్ కి ఇంకా వారమే ఉంది.. కానీ తమిళంలో సార్ ఆడియో లాంచ్ ని ఘనంగా నిర్వహించారు.. తెలుగులో ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వలేదు అన్నారు. కానీ తాజాగా హైదరాబాద్ లో తెలుగు సార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మరో స్టార్ హీరో విజయ్ మాదిరిగా ధనుష్ కూడా సినిమా ప్రమోషన్స్ కి రాడేమో అనుకున్నారు.
వారసుడు సినిమాని తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించగా, దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసారు. కానీ విజయ్ తెలుగుని లైట్ తీసుకుని తమిళనాట వారిసు ఈవెంట్ లో పాల్గొన్నాడు. తెలుగులో ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా రాలేదు. కానీ ధనుష్ సార్ ట్రైలర్ లాంచ్ కి హాజరవడమే కాదు.. తనకి తెలుగు మార్కెట్ కూడా ముఖ్యమని చెప్పడంతో తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ధనుష్ సార్ మూవీ కూడా తెలుగు నిర్మాత నాగ వంశీ నిర్మాణంలో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో అందరిలో ధనుష్ తెలుగు ప్రమోషన్స్ కి వస్తాడా అనే అనుమానం కలిగింది.
ఇక ధనుష్ తెలుగులో ప్రమోషన్స్ కి రావడంతో ఇక్కడ కూడా సినిమాపై మంచి అంచనాలు కలగడం ఖాయం. ఇక ధనుష్ సార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన లుక్ చూసిన వారు పవన్ కళ్యాణ్ మాదిరి ఆ గెడ్డం ఏమిటి అన్నా అని అడుగుతున్నారు.