Advertisementt

పవన్-బాలయ్య మల్టీస్టారర్

Fri 10th Feb 2023 10:45 AM
unstoppable 2,nbk - pspk episode  పవన్-బాలయ్య మల్టీస్టారర్
Pawan-Balayya multistarrer పవన్-బాలయ్య మల్టీస్టారర్
Advertisement
Ads by CJ

ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో ఆహా అనిపించేలా బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ క్రేజీ ఎపిసోడ్స్ రెండూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. రీసెంట్ గా రెండో ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ టాక్ షోలో పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు, వ్యక్తిగత విషయాలను బాలయ్య టాక్ షో వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బాలయ్య అల్లరి, పవన్ కళ్యాణ్ సిగ్గు మొహమాటం, ఆయన చిలిపి నవ్వు అన్ని షోకి హైలెట్ గా నిలిచాయి. మధ్యలో హరి హర వీరమల్లు దర్శకుడు క్రిష్ ఎంట్రీ.. సినిమా విషయాలు అన్ని పవన్ ఫాన్స్ కి బాలయ్య అభిమానులకి బాగా నచ్చేసాయి.

మధ్యలో పవన్ కళ్యాణ్ కి ఎస్ ఆర్ నో కి పరీక్ష పెట్టారు బాలయ్య, అందులో.. ఆడియన్స్ పోల్ కూడా ఉంది. బాలకృష్ణ మట్లాడుతూ.. భయ్యాకు వదినమ్మకి గొడవ జరిగితే ఎవరు ముందు సారి చెబుతారనగానే.. పవన్ మీరు సారి చెప్పొద్దూ అంటూ అభిమానులు అరవగా.. దానికి పవన్ కళ్యాణ్ అసలు గొడవ రాకుండా చూసుకుంటాను, సారి చెప్పే అవసరం రాకుండా చూసుకుంటాను అని పలక మీద రాయగానే బాలయ్య అబ్బ భలే తప్పించుకున్నావ్ భయ్యా అన్నారు.

తనతో మల్టీ స్టారర్ చేయాలని ఉందా.. అనే బాలయ్య ప్రశ్నకి, అభిమానులంతా ఎస్ అని అరవగానే పవన్ కూడా ఎస్ అంటూ పలకపై రాసి చూపించడంతో ఆడిటోరియం అంతా అరుపులు కేకలతో నిండిపోయింది. మరి పవన్ ఎస్ చెప్పడం కాదు.. బాలయ్య-పవన్ కలిసి సినిమా చేస్తే ఆర్.ఆర్.ఆర్ కన్నా డబుల్ హిట్ గ్యారెంటీ అంటూ ఇద్దరి అభిమానులు కోరుకుంటున్నారు. 

Pawan-Balayya multistarrer:

Unstoppable 2 : NBK - PSPK episode highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ