రామ్ చరణ్ RC15 షూటింగ్ హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో ప్లాన్ చేసి శంకర్ అండ్ టీమ్ చార్మినార్ చేరుకొని అక్కడ నుండి RC15 షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు. హైదరాబాద్ లోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్ పై ఇంట్రో సాంగ్ ని శంకర్ చిత్రీకరించనున్నారని అన్నారు. అయితే నిన్నటి నుండి చార్మినార్ వద్ద షూటింగ్ చెయ్యగా.. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొంటున్నాడు. చార్మినార్ ప్రాంతంలో ఆ సాంగ్ లోని కొంత భాగం షూటింగ్ ముగుంచుకుని టీమ్ ఇప్పుడు కర్నూలుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది.
కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఈ సాంగ్ కొంతమేర షూట్ చేయబోతున్నారట. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గరకి రామ్ చరణ్ RC 15 షూటింగ్ చేసేందుకు వస్తున్నాడని తెలుసుకుని అక్కడికి మెగా ఫాన్స్ పెద్దఎత్తున చేరుకోవడమే కాకుండా.. కర్నూల్ కి స్వాగతం పలుకుతూ కొండా రెడ్డి బురుజు సమీపంలో బ్యానర్ లు కట్టి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఛానల్స్ లో కర్నూలు కొండారెడ్డి కోట దగ్గర విజువల్స్ ప్రచారమవుతున్నారు. అంటే రామ్ చరణ్ చార్మినార్ టు కర్నూలు కొండా రెడ్డి బురుజు అన్నట్టుగా ట్రావెల్ చేస్తున్నాడన్నమాట.
ఇక కర్నూలులో షూటింగ్ చేసుకుని అక్కడినుండి రాజమండ్రికి వెళతారట. రాజమండ్రిలో మిగిలిన సాంగ్ చిత్రీకరణ పూర్తి చేస్తారట శంకర్. ఈ సాంగ్ లో హీరోయిన్ తో పని లేదట. రామ్ చరణ్ పై సోలోగా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది.