Advertisementt

అమెరికాలో ఆర్పీ చేపల పులుసు

Sat 11th Feb 2023 07:55 PM
rp,nellore pedda reddy chepala pulusu,america  అమెరికాలో ఆర్పీ చేపల పులుసు
RP fish pulusu in America అమెరికాలో ఆర్పీ చేపల పులుసు
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో ఫెమస్ ఏమో కానీ.. ఇప్పుడు కిర్రాక్ ఆర్పీ అంటే నెల్లూరు చేపల పులుసుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. హైదరాబాద్ వాసులంతా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కోసం ఎగబడిపోతున్నారు. కూకట్ పల్లి బ్రాంచ్ సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు కిర్రాక్ ఆర్పీ మణికొండలో మరో బ్రాంచ్ తెరిచాడు. జబర్దస్త్ బ్యాచ్ మొత్తాన్ని పిలిచి అందరికి చేపల పులుసు తో విందు భోజనం పెట్టాడు. నాగబాబు ని ప్రత్యేకంగా ఆహ్వానించాడు. ఇక యూట్యూబ్ ఛానల్స్ ఎప్పటిలాగే ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మణికొండ బ్రాంచ్ చుట్టూ తిరుగుతున్నాయి.

మణికొండ బ్రాంచ్ ఓపెనింగ్ లో ఆర్పీ తన చేపల పులుసు ఫెమస్ అవ్వుద్ది అన్ని తెలుసు. కానీ ఇంతగా పాపులర్ అయ్యిద్ది అన్ని తెలియదు అంటూ పొంగిపోయాడు. అయితే ఓవర్సీస్ లో చేపల పులుసు పెడతారా అని ఛానల్స్ యాంకర్స్ అడిగితే.. నాకు అమెరికా నుండి బోలెడన్ని ఫోన్స్ వస్తున్నాయి. చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చెయ్యమని, కానీ ఇందులో ఇంకాస్త అనుభవం వచ్చాకే.. నేను అమెరికాలో బ్రాంచ్ తెరుస్తాను. ప్రస్తుతం కూకట్ పల్లి, మణికొండ బ్రాంచ్ తర్వాత అమీర్ పేటలో మరో బ్రాంచ్ ఓపెన్ చేస్తాను.

చేపల పులుసు బిజినెస్ లో బాగా అనుభవం వస్తే.. అమెరికా గురించి ఆలోచిస్తాను, చాలామంది చేపల పులుసు బావుంది అని.. ఇక్కడ కూడా పెట్టమని ఫోన్స్ చేస్తున్నారు, తప్పకుండా అమెరికాకి నా చేపల పులుసు వెళుతుంది అంటూ ఆర్పీ గర్వంగా చెప్పుకుంటున్నాడు. 

RP fish pulusu in America:

RP Nellore Pedda Reddy chepala pulusu in America

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ