కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ ని వదిలెయ్యడానికి ముఖ్య కారణం నాగబాబే. నాగబాబు గారు జబర్దస్త్ మీద అలిగి పక్క ఛానల్ కి పోయి అదిరింది స్టార్ట్ చేపించడంతో ఆర్పీ, చంద్ర లాంటి వాళ్ళు జబర్దస్త్ ని వదిలేసారు. అయితే అందరూ కామ్ గా తమ కామెడీ తాము చేసుకుంటున్నా.. ఆర్పీ మాత్రం జబర్దస్త్ పై పగ బట్టాడు. అక్కడి యాజమాన్యంపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. జబర్దస్త్ అలా, యాజమాన్యం వాళ్ళు ఇలా అంటూ యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇచ్చాడు. ఆ విషయంలో ఆర్పీని వ్యతిరేఖిస్తూ జబర్దస్త్ లోని చాలామంది ఆర్పీపై కౌంటర్ ఎటాక్స్ చేసారు.
ముఖ్యంగా ఆది, రామ్ ప్రసాద్ లు ఆర్పీ ఫై కౌంటర్లు వేశారు. అయితే జబర్దస్త్ ని వదిలేసినా.. అక్కడి వాళ్ళని వదలకుండా ఆర్పీ స్నేహాన్ని మెయింటింగ్ చేస్తున్నాడా అనిపించేలా ఆయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మణికొండ బ్రాంచ్ ఓపెనింగ్ కి ఆది, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, అభి ఇలా అందరిని ఇన్వైట్ చేసాడు. తన ఓపెనింగ్ కి బుల్లితెర నటులని, యూట్యూబ్ ఛానల్స్ ఇలా అందరిని ఇన్వైట్ చేసి.. జబర్దస్త్ ని వదిలేసినా అక్కడి వాళ్ళని వదలను అని ఆర్పీ నిరూపించాడు.
జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిపోయిన వాళ్ళు, జబర్దస్త్ లో కొనసాగుతున్న వాళ్ళు అంతా ఆర్పీ చేపల పులుసు షాప్ ఓపెనింగ్స్ లో ఒకే తాటిపైకి వచ్చి సందడి చేసారు.