సమంత గత ఏడాది పాన్ ఇండియా ఫిల్మ్ యశోద తో సత్తా చాటింది. కానీ సమంత ఆ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యలేకపోయింది. యశోద విడుదలకు ముందు నుండే ఆమె మాయోసైటిస్ అనే వ్యాధితో తీవ్రంగా పోరాడింది. అనారోగ్యంతో సమంత కనీసం సోషల్ మీడియా ముఖం కూడా చూడలేకపోయింది. ఇక శాకుంతలం విడుదలకు దగ్గరవడంతో సమంత కొద్దిరోజులుగా పబ్లిక్ లోకి రావడం స్టార్ట్ చేసింది. శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రావడం, అలాగే ముంబైలో రాజ్ అండ్ DK డైరెక్షన్ లో తెరకెక్కబోయే సిటాడెల్ వెబ్ సీరిస్ కి తయారవడంతో సమంత పూర్తిగా కోలుకుంది. కాబట్టే జిమ్ లో వర్కౌట్స్, అలాగే షూటింగ్స్ కి రెడీ అయ్యింది అనుకుంటున్నారు.
కానీ తాజాగా సమంత ట్రీట్మెంట్ ఇంకా పూర్తికాలేదట. మాయోసైటిస్ కి చికిత్స తీసుకుంటూనే.. ఆమె IVIG థెరపీ తీసుకుంటున్నట్టుగా, న్యూ నార్మల్ అన్న క్యాప్షన్ తో తన ఇన్స్టా స్టోరీస్ తన హెల్త్ పై అప్ డేట్ ఇచ్చింది. మానవశరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని సమర్ధవంతంగా పని చెయ్యడానికి, ఇతర వ్యాధుల కారణంగా ఇన్ఫెక్షన్ సోకకుండా.. ఈ థెరపీ ఉపయోగపడుతుంది అని సమంత తెలిపింది. దీనికోసం రెండు నుండి నాలుగు గంటల పాటు టైమ్ స్పెండ్ చేస్తున్నట్టుగా సమంత తెలియజేసింది.
ఇలా సమంత థెరపీ తీసుకుంటూనే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ, షూటింగ్స్ కి హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె మాయోసైటిస్ వ్యాధి నుండి కోలుకుని పబ్లిక్ లోకి వచ్చినప్పటినుండి చేతికి ఓ జపమాల ధరించి ఉండడం తరుచూ కనిపిస్తుంది. సమంత తన హెల్త్ పై ఇచ్చిన అప్ డేట్ తో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.