Advertisementt

మహేష్ కి విలన్ దొరికేసాడు

Tue 14th Feb 2023 11:54 AM
trivikram,ssmb28  మహేష్ కి విలన్ దొరికేసాడు
Trivikram Repeats His Villain For SSMB28 మహేష్ కి విలన్ దొరికేసాడు
Advertisement
Ads by CJ

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో SSMB28 మొదలు పెట్టారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అయితే మహేష్ నాలుగు రోజుల క్రితం స్పెయిన్ వెళ్లారు. మహేష్ స్పెయిన్ తిరిగిరాగానే.. SSMB28 కొత్త షెడ్యూల్ మొదలు పెడతారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే , శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబుతో తలపడబోయే విలన్ విషయంలో మహేష్ ఫాన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. విజయ్ సేతుపతి, పృథ్వి రాజ్ సుకుమారన్ లు SSMB28 భాగమవుతారనే టాక్ వినిపించింది.

కానీ ఇప్పుడు త్రివిక్రమ్ హీరోయిన్స్ లాగే విలన్ ని కూడా రిపీట్ చేయబోతున్నారని తెలుస్తుంది. గతంలో అరవింద సమేతలో ఎన్టీఆర్ కి విలన్ గా నటించిన జగపతి బాబుని SSMB28 లో మహేష్ బాబు కి విలన్ గా దించబోతున్నట్లుగా తెలుస్తుంది. జగపతి బాబు కేరెక్టర్ సూపర్ స్టైలిష్ గా త్రివిక్రమ్ డిజైన్ చేయబోతున్నారట. శ్రీమంతుడు లో మహేష్ కి తండ్రిగా నటించిన జగపతి బాబు ఇప్పుడు మహేష్ కి విలన్ గా మారబోతున్నాడట. మరి మహేష్ బాబు-జగపతి బాబు మధ్యన రాబోయే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా చూపిస్తారని తెలుస్తుంది.

Trivikram Repeats His Villain For SSMB28:

SSMB28 update

Tags:   TRIVIKRAM, SSMB28
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ