సునీత మొదటి భర్తకి విడాకులిచ్చి ఇద్దరి పిల్లలతో ఒంటరిగా ఉంటూనే రామ్ వీరపనేని ని రెండేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత, పెళ్ళికి ముందు సునీతపై ఎన్ని విమర్శలు, ఎంత ట్రోలింగ్ నడిచినా ఆమె లెక్క చెయ్యలేదు. తన జీవితంలో జరిగే విషయాలను ఎవరితో చెప్పక్కర్లేదు అంది. అయితే గత కొద్దిరోజులుగా సింగర్ సునీత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఎన్ని విమర్శలొచ్చినా అన్నిటికి బదులిచ్చే సునీత ఈ విషయంలో మాత్రం కామ్ గా ఉండిపోయింది.
అందుకే ఈ రూమార్ బాగా సర్కులేట్ అయ్యింది. దానితో తాజాగా సునీత ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించింది. నేను ప్రెగ్నెంటా ఆ విషయం నాకే తెలియదు. అలాంటి చెత్త రూమర్స్ పుట్టిస్తున్నారు అంటే.. అది వాళ్ళ ఆలోచనా విధానానికే వదిలేస్తున్నాను, వారు ఎన్ని నిందలు వేసినా.. ఎంతగా బాధపెట్టినా నన్ను నా జీవితాన్ని ఏమి చెయ్యలేరు అంటూ సునీత తన ప్రెగ్నెన్సీ రూమర్స్ పై కాస్త ఘాటుగానే స్పందించింది.