Advertisementt

నెల గ్యాప్ లో రెండు సినిమాలు

Wed 15th Feb 2023 12:03 PM
santosh shoban,sridevi shoban babu  నెల గ్యాప్ లో రెండు సినిమాలు
Santhosh Sobhan Two Movies Ready To Release In One Month Gap నెల గ్యాప్ లో రెండు సినిమాలు
Advertisement
Ads by CJ

యంగ్ హీరో సంతోష శోభన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రిజల్ట్ తో పనేముందు అనుకున్నాడో ఏమో కానీ.. అస్సలు ఖాళీ లేకుండా సినిమా షూటింగ్స్ చెయ్యడం, ఆ సినిమాలు రిలీజ్ కి రెడీ చెయ్యడమే పనిగా పెట్టుకున్నాడు. గత నెల సంక్రాంతి సందర్భంగా కళ్యాణం కమనీయం అంటూ వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య, వారసుడు తో పోటీ పడ్డాడు. ఆ సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోయింది.

ఇక ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యి నెల తిరగ్గానే..  శ్రీదేవి శోభన్ బాబు అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రేపు శివరాత్రి స్పెషల్ గా రాబోతున్నాడు. శోభన్ బాబుకీ నోటి వాటం ఎక్కువ - శ్రీదేవికి చేతి వాటం ఎక్కువ! 🔥💥 అంటూ బాగానే హడావిడి చేస్తుంది టీమ్. శ్రీదేవి శోభన్ బాబు ప్రమోషన్స్ కూడా హీట్ మీదే ఉన్నాయి. మరి కేవలం ఒక్క నెల గ్యాప్ లో రెండు సినిమాలని సంతోష్ శోభన్ రిలీజ్ చెయ్యడం ఆయన ఫాన్స్ కి హ్యాపీ నే కానీ.. అందులో కంటెంట్ ఎలా ఉంటుందో అనేది ఆడియన్స్ కి అనుమానం. 

చూద్దాం కళ్యాణం కమనీయం తో సక్సెస్ చూడలేకపోయిన సంతోష్.. ఈ ఏడాది శ్రీదేవి శోభన్ బాబు తో హిట్ అందుకుంటాడేమో అనేది.

Santhosh Sobhan Two Movies Ready To Release In One Month Gap:

Santosh Shoban Sridevi Shoban Babu release to Shivaratri special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ