Advertisementt

శ్రీజ-కళ్యాణ్ దేవ్: ఒకరిపై ఒకరు కౌంటర్లు

Wed 15th Feb 2023 12:38 PM
sreeja,kalyan dev  శ్రీజ-కళ్యాణ్ దేవ్: ఒకరిపై ఒకరు కౌంటర్లు
Sreeja-Kalyan Dev: Counters against each other శ్రీజ-కళ్యాణ్ దేవ్: ఒకరిపై ఒకరు కౌంటర్లు
Advertisement
Ads by CJ

చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ శ్రీజ ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. శ్రీజ-కళ్యాణ్ దేవ్ కి ఇద్దరూ విడాకులు తీసుకున్నారో.. లేదంటే సపరేట్ గా ఉంటున్నారో అనేది ఇప్పటికి క్లారిటీ లేదు, రీసెంట్ గా కళ్యాణ్ దేవ్ బర్త్ డే ని కుమార్తె నివిష్క సెలెబ్రేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ప్రస్తుతం శ్రీజ-కళ్యాణ్ దేవ్ లు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేసే శ్రీజ కన్నా కళ్యాణ్ దేవ్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడు.

అయితే ఈ ప్రేమికుల రోజున కళ్యాణ్ దేవ్-శ్రీజలు విడి విడిగా పోస్ట్ లు పెట్టారు. మనం వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నామని కాదు.. వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం అంటూ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసాడు కళ్యాణ్ దేవ్. అయితే కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ పై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ ఇంతగా ప్రేమించినా శ్రీజ తనని పట్టించుకోలేదేమో అందుకే దూరం అయ్యాడంటూ కామెంట్ చేస్తున్నారు.

అటు శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్ కి కౌంటర్ ఇచ్చిందా అనేలా.. ప్రేమ అంటే.. నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు, తనతో తానే ప్రేమలో పడేలా చెయ్యడం, ఉన్న ప్రేమని గుర్తించాలి, ప్రేమ కోసం ఎక్కడో వెతక్కూడదు అంటూ పోస్ట్ పెట్టింది. మరి ఈ పోస్ట్ లోనూ నెటిజెన్స్ నిగూడార్ధాలు వెతుకుతున్నారు. కళ్యాణ్ దేవ్-శ్రీజ ఇద్దరూ ఇలా సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు వేసుకుంటున్నారేమో అంటున్నారు.

Sreeja-Kalyan Dev: Counters against each other:

Sreeja-Kalyan Dev: Valentines day poster goes viral

Tags:   SREEJA, KALYAN DEV
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ