మాళవిక మోహన్ అంటే గ్లామర్ కి మారు పేరు, మాళవిక మోహన్ సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేస్తే.. అందాలు ఎంతగా చూపించాలో అంతగా చూపించే వరకు నిద్రపోదు, అందుకే చేసిన సినిమాలు తక్కువే అయినా.. సోషల్ మీడియాలో మాళవిక మోహన్ కి విపరీతమైన గిరాకీ ఉంది. ప్రస్తుతం మలయాళ మూవీ, తమిళ మూవీస్, టాలీవుడ్ లో ప్రభాస్ తో రాజా డీలక్స్ లో నటిస్తున్న మాళవిక మోహన్ తాజాగా నయనతారని లేడీ సూపర్ స్టార్ అనడం నచ్చలేదు అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ తో హైలెట్ అయ్యింది.
కానీ నయనతార అభిమానులు మాళవికకి టార్చర్ చూపిస్తూ ట్రోల్స్ చేసేసరికి దెబ్బకి దిగొచ్చి నేను అలా అనలేదు, ఇలా అనలేదు అంటూ వివరణ ఇచ్చుకుంది. అయితే ఈరోజు బుధవారం మాళవిక మోహన్ ఓ ఈవెంట్ కి హాజరైంది. ఆ ఈవెంట్ కి వెళ్లే ముందు ఆమె తీయించుకున్న ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోస్ చూస్తే నిజంగా షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఎప్పుడూ ఆందాలు చూపించే మాళవిక మోహన్.. ప్రస్తుతం ఈ లుక్ లో పద్దతికి పట్టు చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉంది.
అంటే ముద్దుగా, క్యూట్ గా ఉంది.. కానీ గ్లామర్ షో చేసే మాళవిక ఇప్పుడు పద్దతిగా సారీ లో ఎలాంటి అందాలని చూపించకుండా ఆకర్షణగా కనిపించడమే షాకింగ్ విషయం. లూజ్ హెయిర్ తో సారీ లుక్ లో మాళవిక మోహన్ అందాలు హైలెట్ అవుతున్నాయి. మీరూ మాళవిక కొత్త పిక్ ని ఓ లుక్కెయ్యండి.