గత ఏడాది ఆదిపురుష్ టీజర్ పై వచ్చిన ట్రోల్స్ తర్వాత ఆదిపురుష్ మేకర్స్ సినిమాని జనవరి 12 న విడుదల చెయ్యడం లేదు జూన్ 16 కి రిలీజ్ డేట్ ఛేంజ్ చేశామంటూ ప్రకటించారు. ఆదిపురుష్ టీజర్ లో గ్రాఫిక్స్ వర్క్ పై వచ్చిన విమర్శలతో టీమ్ సినిమా విడుదలని ఆపేసింది. అప్పటినుండి ఆదిపురుష్ టీమ్ కామ్ గా పని చేసుకుపోతుంది. 3D లో తెరకెక్కిన ఆదిపురుష్ ని హాలీవుడ్ లోను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ దర్శకుడు ఓం రౌత్ చెబుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆదిపురుష్ హాష్ టాగ్ తో ప్రభాస్ ఫాన్స్ హడావిడి చేస్తున్నారు.
ఆదిపురుష్ హీరోయిన్ జానకి కృతి సనన్ నటించిన షెహజాదా హిందీలో రేపు శుక్రవారం రిలీజ్ కాబోతుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా రాబోతున్న షెహజాదా రిలీజ్ ప్రమోషన్స్ లో కృతి సనన్ ఆదిపురుష్ పై చేసిన కామెంట్స్ ని ఆ వీడియోస్ ని ప్రభాస్ ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో జానకిగా నటించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, ఈ సినిమా చూసాక దేశం మొత్తం గర్విస్తుంది అని నేను ఆశిస్తున్నాను అంటూ కృతి సనన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ వీడియోస్ తోనే ఆదిపురుష్ హాష్ టాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ పై అంచనాలు పెంచేలా చేస్తున్నారు. ఇక జూన్ లో విడుదల కాబోయే ఆదిపురుష్ ప్రమోషన్స్ హంగామా టీమ్ ఎప్పుడు మొదలు పెడుతుందా అని అభిమానులు ఆరాటంతో ఎదురు చూస్తున్నారు.