రాజు గారు రాణి గారు అంటూ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత వరసగా సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం కి సక్సెస్ మాత్రం అందని పండులా తయారైంది. SR కల్యాణ మండపం ఓకె ఓకె రిజల్ట్ తర్వాత వచ్చిన సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావల్సిన వాడిని ఇవన్నీ అతనికి ప్లాప్ లే కట్టబెట్టాయి. హీరోగా ఒక్క హిట్ అయినా రాకపోతుందా అని వెయిట్ చేస్తున్న కిరణ్ అబ్బవరానికి అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత సపోర్ట్ దొరికింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా చెయ్యడమే కాదు, ఆ బ్యానర్ కి తగ్గ ప్రమోషన్స్ చెయ్యడంతో ఇప్పుడు అందరికి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
బుల్లితెర షోస్ లోను, కాలేజెస్ లోను, తిరుపతిలో ఆడియో లాంచ్, అక్కినేని అఖిల్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. రేపు శివరాత్రి స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ వినరో భగ్యమైనా కిరణ్ అబ్బవరానికి దురదృష్టాన్ని దూరం చేస్తుందో.. లేదంటే అదే దురదృష్టాన్ని కంటిన్యూ చేయిస్తుందో చూడాలి.
ఇక కిరణ్ అబ్బవరం తరచూ తనపై జరిగే ట్రోలింగ్ పై కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటాడు. ఒక్క సక్సెస్ ఒకే ఒక్క సక్సెస్ తగిలితే తానేమిటో చూపిస్తాడు ఇక. మరి ఆ అదృష్టం అతనికి ఈ సినిమా సక్సెస్ తో రావాలని కోరుకుందాం.