Advertisementt

అసలు సమంతని అడగలేదట

Sat 18th Feb 2023 07:49 PM
samantha,pushpa 2  అసలు సమంతని అడగలేదట
Samantha was not asked అసలు సమంతని అడగలేదట
Advertisement
Ads by CJ

సమంత మాయోసైటిస్ నుండి ఆల్మోస్ట్ బయటపడినట్లుగానే కనిపిస్తుంది. ట్రీట్మెంట్ తర్వాత కోలుకుని.. ఇప్పుడు తన రొటీన్ లైఫ్ లో బిజీ అయ్యింది. ప్రస్తుతం IVIG థెరపీ తీసుకుంటూనే జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంది. అలాగే షూటింగ్స్ లోను జాయిన్ అయ్యింది. తెలుగులో విజయ్ దేవరకొండ తో చేస్తున్న ఖుషి షూటింగ్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యింది. ముంబైలో సిటాడెల్ వెబ్ సీరీస్ షూటింగ్ కి హాజరు కాబోతుంది. అయితే సమంతని పుష్ప ద రూల్ కోసం మరోసారి ఐటెం సాంగ్ చెయ్యమని పుష్ప మేకర్స్ సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావా అంటూ పుష్ప పార్ట్ 1 లో దుమ్మురేపిన సమంతనే పార్ట్ 2 లో ఐటెం కోసం సంప్రదించబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. అంతేకాకుండా సమంత పుష్ప 2 ఐటెం సాంగ్ ని రిజెక్ట్ కూడా చేసింది అంటున్నారు. కానీ సమంత టీమ్ మాత్రం పుష్ప 2 కోసం సమంతని సంప్రదించలేదని చెబుతుంది. అసలు పుష్ప ద రూల్ స్పెషల్ సాంగ్ కోసం పుష్ప టీమ్ సమంతని సంప్రదించే ప్రయత్నమే జరగలేదని చెప్పడంతో.. పుష్ప 2 లో సమంత మరోసారి ఐటెం సాంగ్ చేస్తుంది అని వస్తున్న వార్తలు జస్ట్ రూమర్ అని తేలిపోయింది. 

Samantha was not asked:

Samantha is NOT approached for special dance for Pushpa 2

Tags:   SAMANTHA, PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ