Advertisementt

భోళాకి మారుతున్న డేట్

Sun 19th Feb 2023 11:13 AM
bhola shankar  భోళాకి మారుతున్న డేట్
Bhola Shankar release date changed? భోళాకి మారుతున్న డేట్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాన్స్ కి మూడో నెలలకో ట్రీట్ సిద్ధం చేస్తూ వాళ్ళకి కిక్ ఇస్తున్నారు. గాడ్ ఫాదర్ వచ్చిన మూడు నెలలకే వాల్తేర్ వీరయ్యతో అద్భుతమైన సక్సెస్ సాధించిన మెగాస్టార్ చిరు మళ్ళీ మూడు నెలలు తిరక్కుండానే భోళా శంకర్ ని విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. ఏప్రిల్ 14న భోళా శంకర్ విడుదల అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు అధికారికంగా ప్రకటించారు కూడా.. కానీ ఇప్పుడు భోళా శంకర్ డేట్ మారిందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇంతకుముందే అఖిల్ ఏజెంట్ కోసం చిరు కాస్త వెనక్కి వెళుతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఏజెంట్ కోసం కాకున్నా.. మెగాస్టార్ చిరు భోళా శంకర్ ని వచ్చే ఆగష్టు కి షిఫ్ట్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నారట. ఈ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. భోళా శంకర్ గా మెగాస్టార్ చిరు పూర్తి మాస్ గా కాకుండా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భోళా శంకర్ లుక్స్ తోనే చిరు ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేసారు. 

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ కేరెక్టర్ లో కనిపించబోతుంది. 

Bhola Shankar release date changed?:

Bhola Shankar release in August?

Tags:   BHOLA SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ