Advertisementt

రామ్ చరణ్-నర్తన్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్

Mon 20th Feb 2023 12:29 PM
ram charan,kannada director,narthan  రామ్ చరణ్-నర్తన్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్
Ram Charan-Narthan Project Confirm రామ్ చరణ్-నర్తన్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్ శంకర్ తో RC 15 చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న RC15 వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండగా.. ఈమధ్యలో రామ్ చరణ్ గౌతమ్ తినన్నూరి తో ఒప్పుకున్న ప్రాజెక్ట్ ని ఆపేసి ఉప్పెన బుచ్చిబాబుతో కొత్త సినిమాని అనౌన్స్ చేసారు. బుచ్చి బాబుతో మూవీ త్వరలోనే మొదలు కాబోతుంది. పాన్ ఇండియా మూవీ గా బుచ్చిబాబు ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. 

బుచ్చిబాబు తర్వాత రామ్ చరణ్ కన్నడ డైరెక్టర్ నర్తన్ తో ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది అంటూ వార్తలొచ్చాయి. తాజాగా రామ్ చరణ్-నర్తన్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అవడమే కాదు.. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా యువీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ భారీగా మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. నర్తన్ ప్రస్తుతం కన్నడ హీరో శివ రాజ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తికాగానే రామ్ చరణ్ తో నర్తన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు గాసిప్ గా చక్కర్లు కొట్టిన చరణ్-నర్తన్ ప్రాజెక్ట్ ఇక మీదట ఆఫీషియల్ అయ్యింది.

నర్తన్ మాస్ కథకి, రామ్ చరణ్ మాస్ కటౌట్ కలిస్తే పూనకాలే అంటూ మెగా ఫాన్స్ అప్పుడే సంబరాలు మొదలు పెట్టేసారు. ఈ ప్రాజెక్ట్ పై అతి త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Ram Charan-Narthan Project Confirm:

Ram Charan Confirmed To Work With Kannada Director Narthan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ