తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో కలిసి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని వారసుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే ఇది తమిళ వారిసు గానే ప్రోజెక్ట్ అయ్యింది కానీ.. తమిళ వాసనలు తప్ప, ఎక్కడా తెలుగు సినిమా అనిపించేలా వారసుడు కనిపించలేదు. ఆఖరికి విజయ్ కనీసం తెలుగులో సినిమాని ప్రమోట్ చెయ్యడానికి కూడా రాకపోవడం తెలుగు ప్రేక్షకులని విస్మయానికి గురి చేసింది. ఇక వారసుడు తెలుగులో రిలీజ్ అయ్యి సో సో టాక్ తో వీరసింహారెడ్డి-వాల్తేర్ వీరయ్యల మధ్యలో నలిగిపోయింది. కానీ దిల్ రాజు మాత్రం ప్రతి రోజు వారసుడు లెక్కని అధికారికంగా ప్రకటించాడు. అసలు ఆ సినిమా తెలుగులో ఎలా ఆడిందో, ఎంత లాభాలు వచ్చాయో ఎవ్వరికి తెలియదు.
ఇక నిన్నగాక మొన్న తెలుగులో విడుదలైన మరో మూవీకి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇక్కడి పేరున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ నిర్మాతగా కోలీవుడ్ హీరో ధనుష్ తో సార్ మూవీని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ కలెక్షన్స్ పరంగాను, పబ్లిక్ టాక్ పరంగాను వారసుడు మీద సార్ 100 రేట్లు బెటర్ అని చెప్పుకుంటున్నారు. అందులోను సార్ కి పెద్ద సినిమాలు పోటీ లేకపోవడం ప్లస్ అవ్వగా.. ధనుష్ ఈగోకి పోకుండా సినిమాని తెలుగులోనూ ప్రమోట్ చేసి ఇక్కడి దర్శకనిర్మాతకు హెల్ప్ చేసాడు.
మరి రెండు సినిమాల టాక్స్, రెండు సినిమాల క్రిటిక్స్ రేటింగ్, రెండు సినిమాల కలెక్షన్స్ చూస్తే ఎవరు గెలిచారో ఆడియన్స్ చెబితేనే బావుంటుంది. వంశీ పైడిపల్లినా..? లేదంటే వెంకీ అట్లూరినా..? అనేది.