రామ్ చరణ్ వరస లైనప్ తో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. శంకర్ తో RC15 లో కియారా అద్వానీతో రొమాన్స్ చేస్తున్న రామ్ చరణ్.. ప్రస్తుతం ఆ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తర్వాత ఉప్పెన బుచ్చిబాబు తో తదుపరి మూవీని ప్రకటించాడు. ఆ మూవీ త్వరలోనే పట్టాలెక్కడానికి రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ క్రేజీ హీరోయిన్ నటించబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అది సీతారామంలో దుల్కర్ కి జోడిగా సీతామహాలక్ష్మీ గా అందరిని తన అందాలతో, నటనతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ రామ్ చరణ్ సరసన నటించే అవకాశం ఉంది అంటూ వార్తలొస్తున్నాయి. సీతారామం తర్వాత ఆమె బాలీవుడ్ లోను బిజీ అయ్యింది. అక్కడ గ్లామర్ షో తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. టూ మచ్ గ్లామర్ షోతో మృణాల్ ఠాకూర్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగులో నాని తో ఓ మూవీ కి సైన్ చేసింది. ఆ సినిమా ఓపెనింగ్ కూడా అయ్యింది.
ఇప్పుడు ఈ బ్యూటీ రామ్ చరణ్ సరసన నటిస్తుంది అనగానే మెగా ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. రామ్ చరణ్ పక్కన మృణాల్ ని ఊహించేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ ఈ చిత్రం తర్వాత కన్నడ డైరెక్టర్ నర్తన్ తో ఓ మూవీ చెయ్యబోతున్నాడు. దీని మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.