Advertisementt

పుష్ప 2 క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్

Tue 21st Feb 2023 10:10 AM
pushpa the rule,allu arjun  పుష్ప 2 క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్
Crazy news on Pushpa The Rule పుష్ప 2 క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ జనవరిలోనే ప్రోపర్ గా పట్టాలెక్కింది. పుష్ప 1 రిలీజ్ అయ్యాక దాదాపుగా ఏడాది సమయం తీసుకున్నాకే సుకుమార్, అల్లు అర్జున్ లు పుష్ప ద రూల్ ని పట్టాలెక్కించారు. జనవరిలో వైజాగ్ లో ఓ భారీ షెడ్యూల్ ని ఫినిష్ చేసి టీమ్ రిలాక్స్ అవుతుంటే అల్లు అర్జున్ మాత్రం తన అల్లు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్స్ కి చెక్కేసాడు. అయితే తాజాగా పుష్ప 2 క్లైమాక్స్ పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పుష్ప ద రూల్  క్లైమాక్స్ లో అల్లు అర్జున్ న్యూ అవతార్ లో కనిపించబోతున్నాడట. అది పుష్ప మూడో పార్ట్ కి లీడ్ అని తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీవల్లి అదేనండి రష్మిక పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఓ ట్విస్ట్, గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా నిలుస్తోందని.. ఈ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక మెయిన్ గా అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ కేరెక్టర్స్ పార్ట్ 2 లో ఉంటే.. ఈ సీక్వెల్ లో మరికొన్ని కొత్త పాత్రలు తమిళ్, హిందీ నుండి యాడ్ అవ్వబోతున్నాయట. అంటే పార్ట్2 లో చాలా కొత్తమొహాలని ప్రేక్షకులు చూస్తారని తెలుస్తుంది.

సుకుమార్.. అల్లు అర్జున్ ని పుష్ప రాజ్ గా ఇంకాస్త కొత్తగా చూపించడానికి రెడీ అయ్యారట. ఇప్పటికే పుష్ప రాజ్ గా ప్రేక్షకుల హృదయాలను దోచేసిన అల్లు అర్జున్.. పార్ట్ 2 లో మరింతగా చెలరేగిపోతాడని తెలుస్తుంది.

Crazy news on Pushpa The Rule :

Pushpa The Rule  update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ