బిగ్ బాస్ సీజన్ 2 లో వివాదాస్పద కంటెస్టెంట్ గా మారి హోస్ట్ నానిని సైతం నీళ్లు తాగించి.. మిగతా కంటెస్టెంట్స్ మీద ఫైట్ చేసి కౌశల్ ఆర్మీ అంటూ హడావిడిచేసి బిగ్ బాస్ విన్నర్ గా బయటికొచ్చాక కూడా హీరో అవుతానంటూ హంగామా చేసి అప్పటినుండి యూట్యూబ్ లో హడావిడి, స్టార్ మా లో హడావిడి తప్ప మళ్ళీ ఎక్కడా కనిపించలేదు కౌశల్ మండా. తాజాగా BB జోడిలో కౌశల్ కూడా డాన్స్ చేస్తున్నాడు. తరుణ్ భాస్కర్-సదా-రాధ జెడ్జెస్ గా బిగ్ బాస్ లో ఫెమస్ అయిన కంటెస్టెంట్స్ ని జోడీలుగా పెట్టి BB జోడి అంటూ డాన్స్ ప్రోగ్రాం స్టార్ మాలో ప్రసారమవుతుంది.
అయితే కౌశల్ మండా బిగ్ బాస్ హౌస్ లో ఎంతగా పొగరుగా ఉండేవాడో.. హోస్ట్ నానిని కూడా విమర్శించాడో.. ఇప్పుడు BB జోడిలోనూ జెడ్జెస్ ని విమర్శిస్తున్నారు. తాజాగా BB జోడిలో అర్జున్ కళ్యాణ్-వసంతిల పెర్ఫార్మెన్స్ జేడ్జ్ లకి బాగా నచ్చింది. అయితే మిగతా జోడీలు కూడా స్కోర్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో కొంతమంది జోడీలు పెరఫార్మెన్స్ మాత్రమే కాదు, ఇక్కడ స్ట్రాటజీ కూడా వాడి మార్కులు వేస్తారు. అలా అర్జున్ కళ్యాణ్ కి వాసంతిలకి భాను-రవికృష్ణ లు 1 మార్క్ ఇవ్వడంతో అది జెడ్జెస్ అయిన రాధా-తరుణ్ భాస్కర్ కి నచ్ఛలేదు. దానితో భాను-రవిని వారు ప్రశ్నించగా వారికి ఎక్కువ స్కోర్ ఇస్తే మేము ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు.
దానితో జెడ్జెస్ కూడా తమ స్ట్రాటజీ ఉపయోగించి రవికృష్ణ-భాను జోడికి తక్కువ మార్కులు వెయ్యడంతో వారు ఎలిమినేషన్ ఫేస్ చేసి ఎలిమినేట్ అయ్యారు. దానితో కౌశల్ సోషల్ మీడియాలో BB జోడి జెడ్జెస్ పై కాస్త ఘాటుగా పోస్ట్ పెట్టాడు. నా ఉద్దేశ్యం ప్రకారం రవి-భానులే బెస్ట్ పెరఫార్మెర్స్ . వారిద్దరే BB జోడి విన్నర్స్. ఎవరు గెలిచినా అది భాను-రవికృష్ణ తర్వాతే. BB జోడిలో వారు మొదటి రౌండ్ నుండి సూపర్ గా పెర్ఫార్మ్ చెయ్యడమే కాదు పింక్ సీటు గెలిచారు. వారు స్ట్రాటజీతో ఆడారు. అందులో తప్పేమి లేదు. జెడ్జెస్ అనేవారు కంటెస్టెంట్స్ డాన్స్ మాత్రమే జేడ్జ్ చెయ్యాలి.
వారి వ్యూహాలని జేడ్జ్ చేసి ఎలిమినేట్ చెయ్యకూడదు.. నాకు అనిపించింది చెప్పాను, సారి జెడ్జెస్ అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవగా.. కౌశల్ నువ్వు బిగ్ బాస్ లో అంతే ఉన్నావ్, ఇప్పుడు BB జోడిలోనూ అంతే ఉంటావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.