గత ఏడాది ఈ సమయానికి బిగ్ బాస్ ఓటిటి అంటూ నానా హంగామా చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో 24/7 అంటూ స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఓటిటి ని ముగించడానికే నానా కష్టాలు పడ్డారు. వీకెండ్స్ నాగార్జున ఎంట్రీ ఉన్నప్పటికీ బిగ్ బాస్ ఓటిటీని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. మరి స్టార్ మా లో గంట పాటు వచ్చే బిగ్ బాస్ నే చూడలేక చస్తుంటే.. ఓటిటిలో 24 గంటలు ఎవరు చూస్తారంటూ పెదవి విరిచారు. అందుకే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ ఓ గంట ఎడిటింగ్ ఎపిసోడ్ నైట్ 9 గంటలకి ప్రసారం చేసేవారు. అయినా బిగ్ బాస్ ఓటిటి తెలుగులో మాత్రం అంతగా సక్సెస్ అవ్వలేదు.
దానితో ఈ ఏడాది బిగ్ బాస్ ఓటిటి ఎత్తేశారనే టాక్ నడుస్తుంది. లేదంటే ఈపాటికి సోషల్ మీడియా మొత్తం బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 పై పడేది. ఆ కంటెస్టెంట్స్ ఓటిటి బిగ్ బాస్ కి వెళుతున్నారు, ఈ కంటెస్టెంట్స్ ఓటిటిలోకి వెళుతున్నారంటూ ఊదరగొట్టేసేవి. కానీ ఇప్పుడు అస్సలు సౌండ్ లేదు. గత ఏడాది ఫిబ్రవరి 26 నుండి సీజన్ 1 మొదలైంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 26 వచ్చేసింది. ఇంతవరకు ఆ ఓటిటి జాడ కనిపించకపోయేసరికి తెలుగులో బిగ్ బాస్ ఓటిటికి మంగళం పాడేశారనే టాక్ మొదలయ్యింది.
మరి బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఏర్పాట్లు చేస్తే చాల్లే.. ఓటిటి నడవదని డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది ప్రస్తుత వ్యవహారం. చూద్దాం ఏం జరుగుతుందో అనేది.