సంక్రాంతికి పోటాపోటీగా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి-వాల్తేర్ వీరయ్య మూవీస్ రెండూ ప్రమోషన్స్ లోనే పదిరోజుల పాటు సోషల్ మీడియాని ఊపేసాయి. మాస్ ఆడియన్స్ కి కునుకు పట్టకుండా ఎప్పుడెప్పుడు వీరసింహారెడ్డిని చూస్తామా.. ఎప్పుడెప్పుడు వాల్తేర్ వీరయ్యని వీక్షిద్దామా అని చూసేలా చేసారు. ఒకే నిర్మాణ సంస్థ.. ఏ హీరోకి ఎంతగా ప్రమోషన్ ఇవ్వాలో అంతగా ప్రమోట్ చేసి సినిమాలని విడుదల చేసారు. వీరసింహారెడ్డికి యావరేజ్ టాక్ రాగా.. వాల్తేర్ వీరయ్యకి హిట్ టాక్ వచ్చెయ్యడం, రెండు సినిమాల కలెక్షన్స్ తో మైత్రి నిర్మాణ సంస్థ హ్యాపీగా ఫీలయ్యింది.
అయితే విడుదలకు ముందు రెండు సినిమాలు అంత హడావిడి చేసినా, విడుదలయ్యాక కూడా అంతే హడావిడి చేసాయి. ఇక రెండు సినిమాల థియేటర్స్ రన్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఓటిటి రిలీజ్ లకి రెడ్డి అయ్యాయి. వీరసింహారెడ్డి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 24 న స్ట్రీమింగ్ కి రాబోతుంటే.. వాల్తేర్ వీరయ్య ఈ నెల 27 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. అయితే వీరసింహారెడ్డి థియేటర్స్ రిలీజ్ కి ముందు ఎంత హడావిడి చేసిందో.. ఓటిటి రిలీజ్ కి ముందు అంతే హడావిడి చేస్తుంది.
కానీ వాల్తేర్ వీరయ్య హడావిడే కనిపించడం లేదు. నెట్ ఫ్లిక్స్ లో ఏ సినిమా వచ్చినా.. గప్ చుప్ గా వచ్చేస్తాయి. అసలు సందడే ఉండవు. కానీ హాట్ స్టార్ లో ఏ సినిమా అయినా.. ఓటిటి డేట్ ఇచ్చినప్పటినుండి రోజురోజుకి సోషల్ మీడియాలో ఏదో హడావిడి చేస్తుంది. ఇప్పుడు వీరసింహారెడ్డి విషయంలోనూ అంతే.