కోలీవుడ్ లోనే కాదు, తెలుగు ప్రేక్షకులకి సుపరిచుతుడైన నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనని వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లుగా తెలుస్తుంది. మంగళవారం సాయంత్రం ప్రభు అనారోగ్యం పాలవ్వగా కుటుంబ సభ్యులు.. వెంటనే చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని.. ఆ నొప్పి ఎక్కువ కావడంతో.. ఆసుపత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తుంది
ప్రభుని పరీక్షించిన డాక్టర్స్ లేజర్ సర్జరీ ద్వారా ఆయన కిడ్నీలో ఉన్న రాళ్లను తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రభు హెల్త్ విషయం మీడియాతో మాట్లాడారు. లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రభును డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.
చంద్రముఖి, డార్లింగ్, శక్తి చిత్రాల ద్వారా తెలుగు సినిమాల్లో నటించిన ప్రభు కోలీవుడ్ డబ్బింగ్ చిత్రాలతోను తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేరు. తాజాగా వంశి పైడిపల్లి-విజయ్ వారసుడు లో నటించారు.