ఇక్కడ సినిమా కుటుంబాల నుండి స్టార్స్ గా ఎదిగిన వారు ఉన్నారు, ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోలుగా ఎదిగిన వారు ఉన్నారు. కానీ కొంతమంది సినిమా ఇండస్ట్రీలో నేపోటిజం పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎంతగా సినిమా ఫ్యామిలీ అయినా.. టాలెంట్ లేనిదే హీరోలుగా నిలదొక్కుకోలేరు అనేది ఎంతోమందిని చూసాం. అయితే తాజాగా టాలీవుడ్ లో అసలు నేపోటిజమే లేదు అంటూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. తనని కొంతమంది ఇండస్ట్రీ నుండి వెళ్ళగొట్టాలనే ప్లాన్ చేసి.. సోషల్ మీడియాలో నాపై ట్రోలింగ్ చేపిస్తున్నారు. కావాలనే ట్విట్టర్ లాంటి ప్లాట్ ఫామ్ నుండి తనపై కొంతమంది బ్యాచ్ ల్లా తయారై కుట్ర చేస్తూ ట్రోల్స్ చేపిస్తున్నారు. ఎవరు ఎంతగా తనని ఇండస్ట్రీ నుండి పంపాలని చూసినా తాను ఎక్కడికి పోను. ఇక్కడే ఉంటాను అంటూ సెన్సేషనల్ గా మాట్లాడాడు.
అంతేకాకుండా టాలీవుడ్ లో అసలు నేపోటిజమే లేదు. నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాను. నన్ను సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ చేవాళ్లంతా సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సినిమా ఫామిలీస్ నన్ను సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ నేపోటిజం ఉంది అనే భ్రమలో చాలామంది ఉన్నారు. అసలు నేపోటిజం లేదు అని చెప్పడానికి నేనే పెద్ద ఎగ్జామ్పుల్ అంటూ కిరణ్ అబ్బవరం నేపోటిజంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.