తారకరత్న మహాశివరాత్రి పర్వదినాన శివైక్యం చెందారు. ఆయన మరణంతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్యరెడ్డిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. తారకరత్న మేనత్తలు, తల్లితండ్రులు, చెల్లెలు, తన కడుపున పుట్టిన బిడ్డలు కన్నీరుమున్నీరవుతూ ఆయనని సాగనంపారు. ఇక తారకరత్న చనిపోయిన మూడోరోజున ఆయన అంత్యక్రియలని తారకరత్న తండ్రి మోహనకృష్ణ చేతుల మీదుగా నిర్వహించింది నందమూరి కుటుంబం.
ఇక తారకరత్న చిన్నకర్మని ఐదో రోజు అంటే ఈ రోజు బుధవారం హైదరాబాద్ FNCC లో నిర్వహించారు. నందమూరి ఫ్యామిలీ మెంబెర్స్, తారకరత్న తండ్రి మోహన కృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ, తారకరత్న మేనత్తలు, కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ, బాలయ్య చిన్న కూతురు ఇంకా మిగిలిన రిలేటివ్స్ తో పాటుగా.. కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. తారకరత్న భార్య అలేఖ్య భర్త ఫోటోని చూస్తూ కన్నీరు మున్నీరు అవుతూనే ఉంది. అలేఖ్య రెడ్డి ఈ చిన్నకర్మ వీడియోలో చాలా నీరసంగా కనిపింది. తారకరత్న పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలకృష్ణ ఆ పిల్లలని చాలా ప్రేమగా చూసుకుంటున్నట్టుగా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.