మెగా హీరో రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తున్నారు. పాపులర్ షో గుడ్ మార్నింగ్ అమెరికా షో లో పాల్గొనేందుకు రామ్ చరణ్ అమెరికా బయలుదేరి వెళ్లారు. అక్కడ రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్, ఆయన అవుట్ ఫిట్స్ కి, అలాగే రామ్ చరణ్ చలాకీగా సందడి చెయ్యడం చూసిన మెగా ఫాన్స్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. ఇండియా కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకి ఈ షోలో చరణ్ పాల్గొనబోతున్నారు. ఈ షో ద్వారా తన కెరీర్, వ్యక్తిగత విషయాలను ఆ పాపులర్ షో ద్వారా వరల్డ్ వైడ్ గా ఉన్న తన ఫాన్స్ తో పంచుకోబోతున్నారు చరణ్.
అమెరికాలో అత్యంత పాపులర్ షో అయిన గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న మొదటి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి కొడుకు గొప్పతనం చూసి ఉప్పొంగిపోతున్నారు. రామ్ చరణ్ అమెరికా వెళ్ళాక చిరు ఈరోజు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షో లో పాల్గొనడం చూస్తే ఎంతో గర్వంగా ఉంది. ఇది భారతీయ సినిమాకి గర్వించే క్షణం. రాజమౌళి మైండ్ లో పుట్టిన ఓ అద్భుతమైన ఆలోచన యొక్క శక్తి ప్రపంచం మొత్తాన్ని చుట్టముట్టడం ఆశ్చర్యంగా ఉంది అంటూ మెగాస్టార్ ట్వీట్ చేసారు.
చరణ్ ఆ షోలో పాల్గొనబోయే పిక్స్ ని షేర్ చేస్తూ మెగాస్టార్ ఆ ట్వీట్ చేసారు. దానితో మెగా ఫాన్స్ చిరు ట్వీట్ ని వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.