Advertisementt

జబర్దస్త్ కొత్త యాంకర్ పారితోషకం తెలుసా..

Thu 23rd Feb 2023 04:10 PM
jabardasth,anchor sowmya rao  జబర్దస్త్ కొత్త యాంకర్ పారితోషకం తెలుసా..
Do you know the new anchor remuneration of Jabardasth? జబర్దస్త్ కొత్త యాంకర్ పారితోషకం తెలుసా..
Advertisement
Ads by CJ

అనసూయ-రష్మీ లు ఇద్దరూ ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్ ద్వారానే బాగా ఫెమస్ అయ్యి సినిమాలు, ఇతర బుల్లితెర షోస్ చేసుకుంటున్నారు. అనసూయ అయితే అందాలతోనే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ రెండురోజులపాటు దున్నేసేది. కానీ ఆమె పారితోషకం ఎక్కువ డిమాండ్ చెయ్యడంతో ఎక్స్ట్రా జబర్దస్త్  ఆమెకి షాకిచ్చి అనసూయ ప్లేస్ లోకి రష్మీకి తీసుకొచ్చింది యాజమాన్యం. అప్పటినుండి జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ యాంకరింగ్ చేస్తున్నారు. ఇక ఆమె అందాలు, ఆమె వాక్చాతుర్యంతో అనసూయ త్వరగా పాపులర్ అయ్యి జబర్దస్త్ కి భారీ పారితోషకం అందుకుంది. అంటే దాదాపు ఒక్కో ఎపిసోడ్ కి రెండు మూడు లక్షల వరకు అందుకుంది. 

ఇప్పుడు కొత్తగా అనసూయ ప్లేస్ లోకి ఎంటర్ అయిన సౌమ్య రావు.. తమిళ అమ్మాయి అయినా తెలుగు బాగానే మాట్లాడేస్తుంది. జెడ్జ్ ఇంద్రజ రికమండేషన్ తో షోకి యాంకర్ గా మారిన సీరియల్ నటి సౌమ్య రావు అందాలు జబర్దస్త్ స్టేజ్ పై బాగానే ప్రొజెక్ట్ అవుతున్నాయి. యాంకర్ గా నిలదొక్కుకోవడానికి కిందా మీదా పడుతుంది. అయితే సౌమ్య రావు జబర్దస్త్ లోకి వచ్చాక ఎపిసోడ్ కి ఎంత పారితోషకం తీసుకుంటుందో అనే క్యూరియాసిటీ చాలామందిలో ఉంది. అయితే కొత్తగా ఎంటర్ అయ్యింది, అలాగే ఇంకా యాంకర్ గా బాగా పాపులర్ అవ్వలేదు. అందుకే మల్లెమాల వాళ్ళు ఆమెకి లక్షలోపు పారితోషకం సెట్ చేశారట.,

అంటే ప్రతి వారం వచ్చే ఒక్కో ఎపిసోడ్ కి సౌమ్య రావు అక్షరాలా 85వేల పారితోషకం అందుకుంటుందని తెలుస్తుంది. మరొకొన్ని వారాల్లో ఆమె క్రేజ్ పెరిగి రేంజ్ మారితే ఆటోమాటిక్ గా పారితోషకం కూడా పెరిగిపోతుంది.

Do you know the new anchor remuneration of Jabardasth?:

Jabardasth new Anchor Sowmya rao Remuneration details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ