త్రివిక్రమ్-మహేష్ బాబు కలయికలో క్రేజీ మూవీగా తెరకెక్కుతున్న SSMB28 కొత్త షెడ్యూల్ ఈ నెల మొదటి వారంలోనే పూర్తవగా.. మహేష్ స్పెయిన్ వెళ్లారు. ఇక మహేష్ తో నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేసిన త్రివిక్రమ్.. ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్స్ ని దించబోతున్నారు. మహేష్ తో మరోసారి పూజ హెగ్డే నటిస్తుండగా.. మహేష్ సరసన యంగ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల ఫస్ట్ టైమ్ జోడి కడుతుంది. అంతేకాకుండా మూడో హీరోయిన్ గా బాలీవుడ్ నుండి మరో హీరోయిన్ దిగబోతుంది అంటూ ప్రచారమైతే గట్టిగా జరుగుతుంది కానీ స్పష్టత లేదు.
ఇకపోతే SSMB28 వర్కింగ్ టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ ని ప్రకటించడానికి ముహూర్తం చూస్తున్నారట మేకర్స్. ఉగాది సందర్భంగా త్రివిక్రమ్ SSMB28 టైటిల్ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇంకొక్క నెల ఆగితే SSMB28 టైటిల్ తో మహేష్ ఫాన్స్ ఉగాది సెలెబ్రేషన్స్ చేసుకుంటారన్నమాట. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు మహేష్ కి విలన్ గా నటించబోతున్నారనే న్యూస్ నడుస్తుంది.