మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో క్రేజీ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న SSMB28 భారీ షెడ్యూల్ ఈ మధ్యనే హైదరాబాద్ లో పూర్తవగా.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు కూడా నటిస్తున్నారని టాక్ ఉంది. గతంలో త్రివిక్రమ్ అరవింద్ సమేతలో ఎన్టీఆర్ కి విలన్ గా జగపతి బాబు ఫ్యాక్షనిస్ట్ గా చాలా రగ్డ్ లుక్ లో కొత్తతరహా గెటప్ లో కనిపించారు. ఇప్పుడు SSMB28లో జగపతి బాబు విలన్ గా నటించబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి
అయితే అరవింద సమేతలో వైట్ పంచె, బనీన్ లో రఫ్ గా కనిపించిన జగపతి బాబు ని త్రివిక్రమ్ ఈసారి సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారట. ఆయన పాత్రని ఇంకో కొత్తతరహా గెటప్ లో డిజైన్ చెయ్యగా.. ఆ కేరెక్టర్ కోసం ఇప్పుడు జగపతి బాబుమేకోవర్ అవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించని కొత్త రకం స్టయిల్లో జగపతి బాబు SSMB28లో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ చిత్రంలో మహేష్ కూడా స్టైలిష్ గానే కనిపిస్తారని తెలుస్తుంది.