Advertisementt

ఈసారి చిరు కి హెల్ప్ చేసేది ఎవరో?

Wed 01st Mar 2023 02:59 PM
chiranjeevi,bhola shankar update  ఈసారి చిరు కి హెల్ప్ చేసేది ఎవరో?
Who will help Chiru this time? ఈసారి చిరు కి హెల్ప్ చేసేది ఎవరో?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటినుండి.. సక్సెస్ కోసం ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలని రీమేక్ అయినా చేస్తున్నారు, లేదంటే యంగ్ హీరోల హెల్ప్ తీసుకుంటున్నారు. అందులో ఆయన మొదటగా ఖైదీ నెంబర్ 150 మూవీ చేసారు. అది తమిళ కత్తి రీమేక్. తర్వాత సై రా నరసింహారెడ్డితో ఒరిజినల్ మూవీ చేసారు. అందులో పలు భాషల స్టార్ నటులు యాడ్ అయ్యారు. ఆ తర్వాత తన కొడుకు రామ్ చరణ్ తో ఆచార్య చేసారు. అది డిసాస్టర్ అయ్యింది. కొడుకు క్రేజ్ కూడా ఆచార్యని కాపాడలేకపోయింది. ఇక గాడ్ ఫాదర్ ఓ రీమేక్. మాలయంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ని మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసారు.

ఇక వాల్తేర్ వీరయ్య ఒరిజినల్ కథే అయినా..అందులో రవితేజ హెల్ప్ చేసాడు. రవితేజ ఎపిసోడ్ వాల్తేర్ వీరయ్యలో లేకపోతే.. వాల్తేర్ వీరయ్య ప్లాప్ అయ్యేదంటున్నారు. రవితేజ ఎపిసోడ్ కూడా బ్లాక్ బస్టర్ కాకపోయినా.. వాల్తేర్ వీరయ్య సక్సెస్ లో టాప్ లో నిలిచింది. మరి ఇప్పుడు చిరు మరో రీమేక్ షూటింగ్ చేసుకుంటున్నారు. అది తమిళంలో హిట్ అయిన వేదాళం ని.. భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం రీమేక్ అయినా కూడా.. ఎవరో ఓ యంగ్ హీరో ఇందులో చిరుకి సపోర్ట్ చేసే కేరెక్టర్ చెయ్యాల్సిందే.

ఎందుకంటే చిరుకి సిస్టర్ గా నటిస్తున్న కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్. ఆమెకి జోడిగా ఓ యంగ్ హీరో ఖచ్చితంగా భోళా శంకర్ లో నటించాలి. మరి ఆ పాత్ర ఎవరు వేస్తున్నారో.. వాళ్ళ క్రేజ్ భోళా శంకర్ కి యాడ్ అవుతుందటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా.. చిరు భోళా శంకర్ లుక్స్ మాత్రం మెగా ఫాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసాయి.

Who will help Chiru this time?:

Chiranjeevi Bhola Shankar update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ