కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు, ఇతర ఛానల్స్ లో కామెడీ చేసాడు.. అది అయ్యిపోయింది. సినిమా తీస్తా అన్నాడు. అది ఆగిపోయింది. కానీ ఆర్పీ జబర్దస్త్ కన్నా చాలా త్వరగా ఫెమస్ అయ్యింది మాత్రం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతోనే. కూకట్ పల్లి ఏరియాలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టి ఫెమస్ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్స్ కిర్రాక్ ఆర్పీ చేపల పులుసుని రాత్రికి రాత్రే ఫెమస్ చేసాయి. కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు మట్లాడుకునేలా చేసాయి.
హైదరాబాద్ వాసులైతే నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు టేస్ట్ చూడడం అటుంచి ఓ పట్టుపట్టాలనే రేంజ్ కి వచ్చేసారు. అంతలా కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు కిచెన్ పై, ఆయన కర్రీ పాయింట్ పై యూట్యూబ్ ఛానల్స్ ఫోకస్ పెట్టాయి. ఇదంతా ఆర్పీ తెలివిగా ప్లాన్ చేసి వాళ్ళకి డబ్బులిచ్చి మ్యానేజ్ చేసి.. చేపల పులుసుని పబ్లిసిటీ చేసుకున్నాడనే వాళ్ళూ లేకపోలేదు. ఇక మణికొండ లో ఓ బ్రాంచ్ తీసి జబర్దస్త్ కమెడియన్స్ అందరిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి తన చేపల పులుసుకి మరింత కలరింగ్ ఇచ్చాడు. అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్ లలో నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు బ్రాంచ్ లు ఓపెన్ చేస్తానని చెప్పిన ఆర్పీ.. అమెరికాలో కూడా చేపల పులుసు బ్రాంచ్ తెరుస్తా అంటూ చెప్పాడు.
ఇక్కడ అనుభవం వచ్చాకే అమెరికాలో కొత్త బ్రాంచ్ అని చెప్పిన ఆర్పీ ప్రసుతం ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆర్పీ చేపల పులుసు ఊసే యూటుబ్స్ లో కనిపించడం లేదు. మరి ఉన్నట్టుండి పబ్లిసిటీ ని ఆపేసాడంటే.. కావాల్సినదానికన్నా ఎక్కువే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పాపులర్ అయ్యిందేమోలే అందుకే ఇలా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.