మొదటి చిత్రం అర్జున్ రెడ్డి తోనే క్రేజీ డైరెక్టర్ గా సూపర్ హిట్ కొట్టి.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న సందీప్ రెడీ వంగా.. ఎప్పుడెప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ మూవీ పట్టాలెక్కిస్తారా అని ప్రభాస్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డి తో స్టార్ ని చేసాడు. ఒక్క సినిమాతోనే సందీప్ రెడ్డి స్టార్ డైరెక్ట్ కాగా.. విజయ్ దేవరకొండ స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి బాలీవుడ్ లో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ చిత్రం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.
సందీప్ రెడ్డి తన తదుపరి చిత్రం ప్రభాస్ తో చెయ్యాలి .. ఇప్పుడు ఆ లైన్ లోకి అల్లు అర్జున్ చేరాడు. పుష్ప తో పాన్ ఇండియా హిట్ కొట్టి.. అదే ఊపులో పుష్ప ద రూల్ కంప్లీట్ అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. తాజాగా బాలీవుడ్ టి సీరీస్ నిర్మాణ సంస్థలో భూషణ్ కుమార్ నిర్మాతగా అల్లు అర్జున్-సందీప్ రెడ్డిల చిత్రం ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డిలు సహా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది ఇదే అతి పెద్ద కాంబో ప్రకటన కావడంతో సోషల్ మీడియా షేక్ అయ్యిపోతుంది. అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 షూటింగ్ కంప్లీట్ కాగానే.. ఈ చిత్రం మొదలవుతుందని తెలుస్తుంది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోయే అల్లు అర్జున్-సందీప్ రెడ్డి వంగ కాంబో అనౌన్సమెంట్ తోనే భారీ అంచనాలను మూటగట్టుకుంది. ఇక ఈ చిత్రం అఫీషియల్ గా మొదలైతే ఇంకెత క్రేజ్ వస్తుందో అంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప తో మాస్ గా పాన్ ఇండియా ప్రేక్షకులకి దగ్గరవ్వగా.. అర్జున్ రెడ్డితో విజయ్ ని కల్ట్ లుక్ లో ప్రేక్షకులకి దగ్గర చేసిన సందీప్ రెడ్డి ఇప్పుడు అల్లు అర్జున్ ని ఇంకెంత మాస్ గా చూపిస్తాడో అంటూ అల్లు ఫాన్స్ అప్పుడే ఊహాగానాల్లోకి వెళ్లిపోయారు.