బిగ్ బాస్ సీజన్ 5 లో మటన్-మటన్, చికెన్- చికెన్ అంటూ గొంతెత్తి అల్లరి చేసి, ఎనెర్జీకి మారుపేరుగా నిలిచి.. చివరిలో విన్నర్ అయ్యే ఛాన్స్ వదులుకుని 25 లక్షల సూట్ కేస్ తో టాప్ 3 కే బటయటికి వచ్చేసిన సోహెల్ బయట మెగాస్టార్ చిరు భార్య సురేఖ అభిమానాన్ని చూసాడు. ఆవిడ బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ పై సోహెల్ కోసం స్పెషల్ బిర్యానీ చేసి పంపించారు. ఇక బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక సోహెల్ సినిమా అవకాశాలతో కళకళలాడాడు. విన్నర్ కన్నా ముందు సోహెల్ హీరోగా సినిమాలు మొదలు పెట్టి షాకిచ్చాడు. హీరోగా పలు ప్రాజెక్ట్స్ తో సోహెల్ షూటింగ్స్ తో అంటూ బిజీ అయ్యాడు.
సినిమాలు విడుదలయ్యాక కానీ తెలియలేదు అసలు రంగు. అంటే సోహెల్ నటించిన సినిమాలేవీ అతనికి హెల్ప్ కావడం లేదు. ఆడియన్స్ నుండి కనీసం మిక్స్డ్ టాక్ కూడా తెచ్చుకోలేక చతికిల పడిపోతున్నాయి. సోహెల్ ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ అసలు వార్తల్లో లేకుండా పోయింది. ఇక రీసెంట్ గా ఒకప్పటి పేరున్న డైరెక్టర్ SV కృష్ణా రెడ్డి డైరెక్షన్ లో చేసిన ఆర్గానిక్ మామ-హైబ్రిడ్ అల్లుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో సోహెల్ హీరో. కానీ ఆ చిత్రమూ అంతే.. ప్రేక్షకులని అస్సలు ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.
ఒకప్పుడు SV కృష్ణా రెడ్డి చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చేవి. కానీ ఈ చిత్రాన్ని అసలు SV కృష్ణారెడ్డినే తెరకెక్కించారా అనేలా ఉంది. ఆయన మార్క్ ఒక్క సీన్ లో కూడా కనిపించలేదు. ఆడియన్స్ అయితే ఎందుకు బాబు ఇలాంటి చిత్రాలు మా మీద రుద్దుతారు అంటూ పెదవి విరుస్తున్నారు. పాపం సోహెల్ హీరోగా ఒక్క సినిమా కూడా హిట్ అవ్వడం లేదు. మరి రాబోయే చిత్రాలేమైనా ప్రేక్షకులని నచ్చితే ఓకె.. లేదంటే కష్టం సుమీ..!