హీరో మంచు మనోజ్ వివాహం ఎలాంటి హడావిడి లేకుండా నిన్న హైదరాబాద్ లోని మంచు లక్ష్మి నివాసంలో జరిగింది అనుకున్నారు. ఎందుకంటే పెళ్లి ముహూర్తం దగ్గర పడేవరకు కూడా మంచు ఫ్యామిలీ నుండి మనోజ్ పెళ్లి విషయం బయటికి రాలేదు. జస్ట్ ఓ వారం ముందే మనోజ్ పెళ్లి తేదీ మార్చి 3 అంటూ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక పెళ్లి వేడుకల్లో ముఖ్యమైన మెహిందీ, సంగీత్ వేడుకలు కూడా సైలెంట్ గానే జరిగాయి. మోహన్ బాబు గారికి పెళ్లి ఇష్టం లేని కారణంగానే ఇలా పెళ్లి మనోజ్ మౌనిక మెడలో సింపుల్ గా తాళి కట్టాడని అనుకున్నారు.
మనోజ్ పెళ్లి సమయానికి మోహన్ బాబు, విష్ణు వచ్చారు. మనోజ్-మౌనిక పెళ్లిని దగ్గరుండి జరిపించారు. ఇక ఈ పెళ్ళికి గెస్ట్ లు ఎవరెవరు హాజరయ్యారో అనేది ఎవ్వరికి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మనోజ్ పెళ్ళికి ఎవరెవరు గెస్ట్ లు వచ్చారో అనేది వీడియోస్ రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మనోజ్ స్నేహితులైన సినీ సెలబ్రిటీస్ ఈపెళ్లికి వచ్చారు. అందులో వైసీపీ నేత అవినాష్, అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో సిద్దు జొన్నలగడ్డ, తేజు సజ్జా, హీరోయిన్స్ నిక్కీ గల్రాని, ఇంకా సింగర్ సునీత ఆమె భర్త రామ్ తో కలిసి ఈ పెళ్ళికి హాజరయ్యింది.
శివ బాలాజీ వైఫ్ మధుమిత, మచ్చ రవి, భూమా మౌనిక రెడ్డి బంధువులు, మోహన్ బాబు రిలేటివ్స్, ఇంకా కొంతమంది స్నేహితులు పాల్గొన్న మంచు మనోజ్ పెళ్లి మౌనిక రెడ్దితో గత రాత్రి అక్క మంచు లక్ష్మి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిపోయింది.