Advertisementt

అమెరికాకి ఎన్టీఆర్?

Sat 04th Mar 2023 12:38 PM
oscars 2023,ntr  అమెరికాకి ఎన్టీఆర్?
NTR to America for Oscars 2023 అమెరికాకి ఎన్టీఆర్?
Advertisement
Ads by CJ

సోదరుడు నందమూరి తారకరత్న దశదిన కర్మ పూర్తికావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికా ఫ్లైట్ ఎక్కుతాడనే ప్రచారం జరుగుతుంది. ఈ మార్చ్ 5 ఆదివారం ఎన్టీఆర్ అమెరికాకి వెళ్ళబోతున్నాడట. ఎప్పుడో ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి అమెరికాకి వెళ్లాల్సి ఉండగా.. ఆయన సోదరుడు మరణంతో అమెరికా ప్రయాణం వాయిదా పడగా రామ్ చరణ్ ఒక్కడే అమెరికాకి వెళ్ళాడు. అక్కడ HCA అవార్డ్స్ లో చరణ్.. రాజమౌళి, కీరవాణి బ్యాచ్ తో సందడి చెయ్యగా ఎన్టీఆర్ మిస్ అయిన విషయం తెలిసిందే.

అయితే మార్చ్ 12 న అమెరికాలో జరగబోయే ఆస్కార్ అవార్డ్స్ కోసం ఎన్టీఆర్ ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నాడని అంటున్నారు. ఆస్కార్ బరిలో ఆర్.ఆర్.ఆర్ నుండి నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్స్ లిస్ట్ లో అవార్డు కోసం పోటీ పడుతుండగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆస్కార్ అవార్డుల స్టేజ్ పై లైవ్ పెరఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఇక ఈ వేడుకల కోసం రామ్ చరణ్ అమెరికాలోనే ఉండిపోయాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వెళ్లి రాజమౌళి, కీరవాణి, చరణ్ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ అమెరికా ప్రయాణంపై ఎలాంటి సమాచారం లేకపోయినా.. ఆయన ఖచ్చితంగా రెండుమూడు రోజుల్లో అమెరికాకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు.

NTR to America for Oscars 2023:

Oscars 2023

Tags:   OSCARS 2023, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ