అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా 2021 లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప ద రైజ్ నార్త్ ఆడియన్స్ నుండి సౌత్ ఆడియన్స్ వరకు అందరిని ఆకట్టుకుంది. పుష్ప రాజ్ గా మాస్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే పుష్ప పార్ట్ 1 లో జస్ట్ లోకల్ రౌడీస్ అంటే సునీల్.. ఇంకా కొద్దిమంది తెలుగులోని చిన్న నటులతో విలన్ వేషాలు వేయించిన సుకుమార్.. పార్ట్2 కోసం మలయాళం హీరో ఫహద్ ఫాసిల్ ని దింపారు.
ఫహద్ ఫాసిల్ భన్వర్ లాల్ షెకావత్ గా పోలీస్ ఆఫీసర్ గా పుష్ప రాజ్ తో ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. పార్ట్ 1 లో ఫహద్ ఫాసిల్ కేరెక్టర్ ని ఘోర అవమానంతో ఎండ్ చేసారు. అంత అవమానం జరిగిన తర్వాత పార్ట్ 2 లో ఆయన విశ్వ రూపం చూడడం పక్కా. ఫహద్ ఫాసిల్ పుష్ప ద రూల్ షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చేసారు. ఇప్పుడు మొదలు కాబోయే షెడ్యూల్ లో ఆయన షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
మరి ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్-భన్వర్ లాల్ షెకావత్ అంటే ఫహద్ ఫాసిల్ మధ్యన ఎలాంటి సీన్స్ ని సుకుమార్ చిత్రీకరించబోతున్నారో అంటూ అల్లు ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇక రష్మిక కూడా ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ కి రానున్నట్టుగా తెలుస్తుంది.