Advertisementt

గంగవ్వకి నాగ్ భారీ సాయం: ఎన్ని లక్షలంటే..

Sun 05th Mar 2023 07:23 PM
nagarjuna,bigg boss gangavva  గంగవ్వకి నాగ్ భారీ సాయం: ఎన్ని లక్షలంటే..
Nagarjuna huge help to Gangavva గంగవ్వకి నాగ్ భారీ సాయం: ఎన్ని లక్షలంటే..
Advertisement
Ads by CJ

యూట్యూబ్ ద్వారా కొద్దిమంది ప్రజలకి దగ్గరై.. స్టార్ మా లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ ద్వారా అందరికి పరిచయమైన పెద్దావిడ గంగవ్వ మరోసారి వార్తల్లో వినిపించింది. గంగవ్వని బిగ్ బాస్ కి ఓ సెలెబ్రిటీ కంటెస్టెంట్ గా తీసుకొచ్చి ఆమెని పాపులర్ చేసింది బిగ్ బాస్ యాజమాన్యం, అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఏసీల వలన ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో.. గంగవ్వని మధ్యలోనే బయటికి పంపేశారు. బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ ని తన మనవడిగా చెప్పుకున్న గంగవ్వ హౌస్ నుండి బయటికి వచ్చాక కాస్త హడావిడి చేసింది. 

అయితే ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ స్టేజ్ పై తన ఊరిలో తనకో సొంతిల్లు కట్టుకోవాలని కోరికని వెలిబుచ్చగా.. బిగ్ బాస్ పారితోషకంతో పాటుగా నాగార్జున కూడా వ్యక్తిగతంగా సహాయం చేస్తా అంటూ మాటిచ్చారు.

ఇక గంగవ్వ ఇల్లు మొదలు పెట్టి రెండేళ్లయ్యింది. ఆ ఇల్లు పూర్తయ్యి గృహ ప్రవేశం కూడా జరిగినా.. నాగార్జున ఆమెకి ఎంత అంటే ఎన్ని లక్షలు సహాయం చేసారో తెలియక చాలామంది ఆతృతగా ఉన్నారు. నాగార్జున కానీ, ఇటు గంగవ్వ కానీ ఈ విషయంలో నోరు మెదపలేదు. తాజాగా, నాగార్జున తనకు ఇచ్చిన సొమ్ము ఎంతో గంగవ్వ బయటపెట్టేసింది. తనకి నాగార్జున 7 లక్షలు ఇచ్చారని చెప్పిన గంగవ్వ.. బిగ్ బాస్, హీరో నాగార్జున సాయంతో తన సొంతింటి కల నెరవేరిందని గంగవ్వ ఆనందం వ్యక్తం చేసింది.

Nagarjuna huge help to Gangavva:

Bigg Boss Gangavva New House 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ