Advertisementt

ఈ పిల్ల పని బావుంది గురూ..

Sun 05th Mar 2023 08:12 PM
actress samyuktha menon  ఈ పిల్ల పని బావుంది గురూ..
Samyuktha Menon work is good Guru.. ఈ పిల్ల పని బావుంది గురూ..
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లో రానాకి వైఫ్ కేరెక్టర్ లో మెరిసిన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ వరస సినిమాల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గత ఏడాది భీమ్లా నాయక్ హిట్, కళ్యాణ్ రామ్ బింబిసార హిట్స్ చూసిన సంయుక్త ఈ ఏడాది సార్ తో తెలుగు, తమిళనాట విజయం అందుకుంది. సార్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే సంయుక్త మరో తెలుగు మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. అదే సాయి తేజ్ విరూపాక్ష. ఈ సినిమా కూడా హిట్ అయితే సంయుక్త మీనన్ డిమాండ్ ఆటోమాటిక్ గా పెరిగిపోతుంది.

ఇప్పటికే సంయుక్త తన పారితోషకం పెంచేసింది అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి సంయుక్త మీనన్ పెద్దగా గ్లామర్ లుక్ లో మెస్మరైజ్ చెయ్యదు, జస్ట్ సాదా సీదా లుక్ లోనే నీట్ గా కనబడుతుంది. పెరఫార్మెన్స్ పరంగా అదుర్స్ అని చెప్పలేము.. కానీ బావుంటుంది. మరి గ్లామర్ కన్నా నటన ముఖ్యం కదా. అందుకే సంయుక్త మీనన్ చిన్న చిన్న పాత్రలతోనే పెద్ద విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కనిపిస్తుంది.

ఇప్పుడు సంయుక్త మీనన్ కి మరో టాలీవుడ్ హీరో అవకాశం ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ఆ యంగ్ హీరో ఎవరో.. ఆ సినిమా ఏమిటో అనేది మరికొద్దిరోజుల్లోనే తెలిసిపోతుందట. మరి నిజంగా ఈ పిల్ల పని చాల అంటే చాలా బావుంది గురూ.. చిన్నగా తెలుగు ప్రజల గుండెల్లో సంయుక్త పాతుకుపోయేలా కనబడుతుంది. 

Samyuktha Menon work is good Guru..:

Actress Samyuktha Menon Hikes Her Remuneration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ